చింతమనేని ప్రభాకర్ కు బెయిల్
- చింతమనేని ప్రభాకర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. నిన్న అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ కలపర్రు టోల్‌గేట్ దగ్గర చింతమనేని అందోళన కు సిద్దమయ్యారు. దీంతో చింతమనేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి నుంచి ఏలూరు పోలీస్ స్టేషన్‌లోనే చింతమనేని ఉన్నారు. ఈరోజు ఉదయం చింతమనేనిని కోర్టులో పోలీసులు హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన వెంట ఉన్న మరో ఎనిమిది మందికి బెయిల్ మంజూరు అయింది. ఈ రోజు బెయిల్ మంజూరు కాగా ఆయన రిలీజ్ ఈరోజే అవుతారా రేపు రిలీజ్ చేస్తారా ? అనేది తెలియాల్సి ఉంది.
Next Story



