బడులు తెరిచేలోగా నాడు-నేడు పనుల పూర్తి

HMTV
By HMTV
Published on: 2020-06-05 04:44:23

దేవరాపల్లి: మండలంలో నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా ఉప విద్యాశాఖాధికారి (పాడేరు) జ్యోతికుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గరిసింగి, పెదనందిపల్లి, చింతలపూడి, దేవరాపల్లి, రైవాడ, తెనుగుపూడి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభించే లోగా పనులన్నీ పూర్తి చేయాలని సర్వశిక్ష అభియాన్‌ ఏఈఈ సంతోష్‌ని ఆదేశించారు. దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌, సీఆర్పీ ఆదిరెడ్డి ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.



 

 

HMTV

HMTV

Next Story