PM Jan Aushadhi Kendra: కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్.. రూ. 5వేలతో ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. ప్రతినెలా రూ.50 వేల ఆదాయం..!

You Can Start PM Jan Aushadhi Kendra With RS 5000 and Earn RS 50000 Per Month Full Details Check Here
x

PM Jan Aushadhi Kendra: కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్.. రూ. 5వేలతో ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. ప్రతినెలా రూ.50 వేల ఆదాయం..!

Highlights

Jan Aushadhi Kendra: మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. లేదా మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అయితే, ఈ వార్త మిమ్మల్ని కచ్చితంగా సంతోషపరుస్తుంది. అవును, మీరు తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 50,000 వరకు సంపాదించవచ్చు.

Modi Govt: మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా.. లేదా మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అయితే, ఈ వార్త మిమ్మల్ని కచ్చితంగా సంతోషపరుస్తుంది. అవును, మీరు తక్కువ పెట్టుబడితో నెలకు రూ. 50,000 వరకు సంపాదించవచ్చు. జన్ ఔషధి కేంద్రాలను ఓపెన్ చేయడానికి PACS కమిటీలను సహకార మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఇక్కడ సరసమైన ధరలకు మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. సహకార మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారంలో, దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాన్ని తెరవడానికి 2,000 ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు (PACS) ఆమోదించారు.

ఆగస్టు నాటికి 1000 కేంద్రాలు ప్రారంభం..

ఈ ఏడాది ఆగస్టు నాటికి సుమారు 1,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగిలిన జన్ ఔషధి కేంద్రాలు డిసెంబర్ 2023 నాటికి తెరవనున్నారు. మీరు జన్ ఔషధి కేంద్రాన్ని తెరవడం ద్వారా ప్రతి నెలా రూ. 50,000 వరకు సంపాదించవచ్చు. మీకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా ఇస్తారు. సహకార మంత్రి అమిత్ షా, రసాయనాలు, ఎరువుల మంత్రి మన్సుఖ్ మాండవియా మధ్య జరిగిన సమావేశంలో, జన్ ఔషధి కేంద్రాలను తెరవడానికి PACS కమిటీలను అనుమతించాలని నిర్ణయించారు.

2,000 పీఏసీఎస్ కమిటీల ఎంపిక..

ఇందుకోసం దేశవ్యాప్తంగా 2,000 పీఏసీఎస్ కమిటీలను ఎంపిక చేయనున్నారు. ఈ ముఖ్యమైన నిర్ణయం పాక్స్ సొసైటీల ఆదాయాన్ని, ఉపాధి అవకాశాలను పెంపొందించడమే కాకుండా సరసమైన ధరకే ప్రజలకు ఔషధాలు అందుబాటులోకి రానున్నాయని సహకార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా సరసమైన మందులను విక్రయించే 9,400 కంటే ఎక్కువ జన్ ఔషధి కేంద్రాలు ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా దాదాపు 1,800 మందులు, 285 వైద్య పరికరాలను విక్రయిస్తున్నారు.

జన్ ఔషధి కేంద్రంలో లభించే మందుల ధరలు బహిరంగ మార్కెట్‌లో లభించే బ్రాండెడ్ మందుల కంటే 50-90 శాతం తక్కువగా ఉన్నాయి. జన్ ఔషధి కేంద్రాన్ని తెరవడానికి, దరఖాస్తుదారు కనీసం 120 చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉండాలి. దీనికి దరఖాస్తు రుసుము రూ.5,000లుగా నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories