Personal Loan: స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం..!

Personal Loan: ఇప్పుడు మీరు రూ.1 లక్ష వరకు తక్షణ రుణం తీసుకోవాలనుకుంటే మీ మొబైల్ నుంచి పొందవచ్చు.

Arun Chilukuri
Updated on: 26 May 2022 9:00 PM IST
You Can Get a Personal Loan of up to Rs 1 Lakh From Google Pay
X

Personal Loan: స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ సదుపాయం..!

Personal Loan: ఇప్పుడు మీరు రూ.1 లక్ష వరకు తక్షణ రుణం తీసుకోవాలనుకుంటే మీ మొబైల్ నుంచి పొందవచ్చు. ఇందుకోసం మీకు Google Pay అవసరం. దీని ద్వారా మీరు రూ.1 లక్ష వరకు తక్షణ రుణాన్ని పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.Google Pay రుణాలను ఎలా అందిస్తోందని మీకు అనుమానం రావొచ్చు. కానీ గూగుల్‌ పే ఫిబ్రవరిలో DMI ఫైనాన్స్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు కలిసి డిజిటల్ పర్సనల్ లోన్‌లను అందిస్తున్నాయి.

మీరు గూగుల్‌ పే ద్వారా డిజిటల్‌గా రూ.1 లక్ష వరకు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. దీనిని 36 నెలలు లేదా గరిష్టంగా 3 సంవత్సరాల వాయిదాలలో చెల్లించవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం DMI ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో దేశంలోని పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ లోన్ తీసుకోవాలంటే కస్టమర్ తప్పనిసరిగా గూగుల్‌ పేలో కస్టమర్ అయి ఉండాలి. క్రెడిట్ హిస్టరీ బాగుండాలి. అప్పుడు మాత్రమే ఈ లోన్ జారీ చేస్తారు. ప్రతి వ్యక్తి ఈ రుణాన్ని పొందవలసిన అవసరం లేదు. ఎందుకంటే దీని కోసం మంచి క్రెడిట్ చరిత్రను కలిగి ఉండటం అవసరం. ప్రీ-క్వాలిఫైడ్ అర్హత కలిగిన వినియోగదారులు DMI ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి ఈ లోన్ తీసుకోగలరు. ఈ లోన్ గూగుల్‌ పే ద్వారా అందిస్తారు. ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్‌లు ఉంటే కస్టమర్ లోన్ అప్లికేషన్ రియల్ టైమ్‌లో ప్రాసెస్ చేయబడుతుంది. రూ.1 లక్ష వరకు రుణం లభిస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story