PPF Account: పీపీఎఫ్‌ ఖాతాదారుడు మెచ్యూరిటీకి ముందే మరణిస్తే.. క్లెయిమ్‌ గురించి తెలుసుకోండి..?

Who gets claim if PPF account holder dies before maturity
x

PPF Account: పీపీఎఫ్‌ ఖాతాదారుడు మెచ్యూరిటీకి ముందే మరణిస్తే.. క్లెయిమ్‌ గురించి తెలుసుకోండి..?

Highlights

PPF Account: గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్‌ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది.

PPF Account: గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్‌ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి తరువాత మార్కెట్ క్షీణించింది. దీంతో పెట్టుబడిదారులకు కోట్లలో నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితిలో ప్రజలు రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. అటువంటి పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. ఈ పథకం ద్వారా మీరు 15 సంవత్సరాలలో భారీ కార్పస్‌ను సృష్టించవచ్చు.

ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా మంది మదిలో ఒక ప్రశ్న మెదులుతోంది. అదేంటంటే పథకం మెచ్యూరిటీకి ముందే ఆ వ్యక్తి మరణిస్తే డబ్బులు ఎలా క్లెయిమ్ చేయాలి..? వాస్తవానికి ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందే ఖాతాదారుడి నామినీ గురించి అడుగుతారు. ఈ పరిస్థితిలో పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీకి ముందు ఖాతాదారుడు మరణిస్తే ఆ డబ్బు నామినీకి చెల్లిస్తారు. అయితే నామినీ తన ID రుజువును చూపించాల్సి ఉంటుంది. అతడికి డబ్బులు చెల్లించాక అకౌంట్‌ క్లోజ్‌ అవుతుంది. దీనిని కొనసాగించడానికి అనుమతి ఉండదు.

పీపీఎఫ్ ఖాతాదారులు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అకౌంటు నుంచి ముందస్తుగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఖాతాదారునికి లేదా అతని కుటుంబానికి ప్రాణాంతకమైన అనారోగ్యం లేదా పిల్లల ఉన్నత చదువుల కోసం మాత్రమే ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు ఖాతాను తెరిచిన ఐదేళ్ల తర్వాత దీనిని మూసివేయవచ్చు. ఇందులో వార్షిక ప్రాతిపదికన 7.1% వడ్డీ రేటును పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories