Mutual Funds: మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో డివిడెండ్, గ్రోత్ ఫండ్‌లలో ఏది బెటర్..?

Mutual Funds: మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో డివిడెండ్, గ్రోత్ ఫండ్‌లలో ఏది బెటర్..?
x

Mutual Funds: మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో డివిడెండ్, గ్రోత్ ఫండ్‌లలో ఏది బెటర్..?

Highlights

Mutual Funds: ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే అందరు బ్యాంకులవైపు చూసేవారు. చాలామంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆధారపడేవారు.

Mutual Funds: ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే అందరు బ్యాంకులవైపు చూసేవారు. చాలామంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఆధారపడేవారు. ఏ బ్యాంకు ఎక్కవ వడ్డీ చెల్లిస్తే ఆ బ్యాంకులో ఇన్వెస్ట్‌ చేసేవారు. ఇప్పటికీ చాలామంది వీటివైపే మొగ్గు చూపుతారు. కానీ కొంతమంది మాత్రం పెట్టుబడికి మ్యూచ్‌వల్ ఫండ్స్‌ని ఆశ్రయిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రావడంతో ప్రస్తుతం ఇందులో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ఇందులో పెట్టుబడి పెట్టాలంటే కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. అవేంటో చూద్దాం.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టబోతున్నట్లయితే అందరికి వచ్చే కామన్‌ డౌట్‌ గ్రోత్ ఆప్షన్ బెటరా.. డివిడెండ్ ఆప్షన్‌ బెటరా..? మీరు కెరీర్ ప్రారంభంలోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే 75 శాతం వరకు ఈక్విటీలలో పెట్టుబడి పెట్టవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. డెట్ ఫండ్స్ కంటే ఈక్విటీ ఎక్కువ రీఫండ్‌లను అందిస్తుంది. మార్కెట్‌లో డజన్ల కొద్దీ ఈక్విటీ ఫండ్‌లు అందుబాటులో ఉన్నాయి, వీటిలో NAVని కొనుగోలు చేయవచ్చు. టాటా ఇండెక్స్ సెన్సెక్స్ ఫండ్, హెచ్‌డిఎఫ్‌సి ఇండెక్స్ సెన్సెక్స్ ఫండ్, మీరే అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్, పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు.

మీరు ఈ ఫండ్స్‌లో SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కింద కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇది కాకుండా, సెక్షన్ 80C కింద మినహాయింపు ప్రయోజనంతో పెట్టుబడి అందుబాటులో ఉన్న అనేక ఫండ్‌లు కూడా ఉన్నాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు గ్రోత్ ఆప్షన్‌తో పాటు డివిడెండ్ ఎంపికను పొందుతారు. డివిడెండ్ ఆప్షన్ ఎంచుకుంటే ఎప్పటికప్పుడు డివిడెండ్ వస్తుందని అయితే ఫైనల్ రిటర్న్ మాత్రం తక్కువగానే ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అందువల్ల స్వల్పకాలిక అవసరాల కోసం, మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగం డివిడెండ్ ఎంపికగా ఉండాలి. అయితే మీరు డివిడెండ్ ఆదాయంపై డివిడెండ్ పన్ను చెల్లించాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories