యూజర్ల దెబ్బకి 'వాట్సప్' కి పట్టిన 'ప్రైవసీ' దెయ్యం వదిలింది!

Whats App sending status messages to Users
x

వాట్సాప్ స్టేటస్ (స్క్రీన్ షాట్)

Highlights

నేనే తోపు.. నే చెప్పిన్నట్టు వినకపోతే వీపు సాపు.. ఇలాంటి కథలు వ్యాపారంలో నడవవు. ఇండస్ట్రీని నేనొక్కడినే ఎలేస్తాను అంటే.. కుదరదు. జనాల్ని వెర్రోళ్ళనుకుంటే ఇదిగో ఇలానే వాట్సప్ లా చేతులు ఎత్తేయాల్సి వస్తుంది.

నేనే తోపు.. నే చెప్పిన్నట్టు వినకపోతే వీపు సాపు.. ఇలాంటి కథలు వ్యాపారంలో నడవవు. ఇండస్ట్రీని నేనొక్కడినే ఎలేస్తాను అంటే.. కుదరదు. జనాల్ని వెర్రోళ్ళనుకుంటే ఇదిగో ఇలానే వాట్సప్ లా చేతులు ఎత్తేయాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకంటే.. ఇటీవల 'మా నూతన ప్రైవసీ పాలసీని అంగీకరిస్తేనే.. మీ వాట్సాప్ అకౌంట్ పనిచేస్తుంది లేకపోతే అకౌంట్ నిలిపివేస్తాం'అంటూ యూజర్లను బెదిరించింది వాట్సాప్. మొత్తం యూజర్ల జుట్టు తన చేతిలోకి తీసుకోవాలని ఎదో పెద్ద పధకమే వేసింది. అయితే అనుకున్నవన్నీ అవుతాయా ఏమిటి? యూజర్లు పో...ఫోవోయి నీకంటే మంచి సర్వీసు ఇచ్చే యాప్ లు చాలా ఉన్నాయి.. బోడి నీకు మా ప్రైవసీ ఎందుకు అప్పచేబుతాం అంటూ వేరేదారి వెదుక్కోవడం మొదలు పెట్టారు యూజర్లు. అంతే కాకుండా ప్రభుత్వం కూడా కలుగ చేసుకుని ప్రశ్నలు సంధించింది. దీంతో దిగిరావాల్సిన పరిస్థితిలో పడిపోయింది వాట్సాప్.

ప్రభుత్వానికి అయితే, ఎదో నాలుగు పేజీల కథ వండి ఇచ్చేస్తే చాలు.. కానీ, యూజర్లు అలా వినే పరిస్థితి ఉంటుందా? సమస్యే లేదు ఒక్కసారి నమ్మకం పోయిందంటే మళ్ళీ దానిని పెంచాలంటే పిల్లిమొగ్గలు వేయాల్సిందే. సరిగ్గా..ఇప్పుడు అదే పిల్లిమొగ్గలు వేస్తోంది వాట్సప్. మొదట తన నిర్ణయాన్ని అంటే ప్రైవసీ పాలసీని మే నెలాఖరు వరకూ వాయిదా వేసుకుంది. తర్వాత యూజర్ల మనోభావాలను కాపదతమంటూ కాళ్ళబేరానికి దిగింది.

అవును.. ఈరోజు వాట్సప్ చూసిన యూజర్లకు మతిపోయే స్టేటస్ దర్శనమిచ్చింది. అదీ..వాట్సాప్ నుంచి. యూజర్లు తమ వాట్సాప్ ఓపెన్ చేసి.. స్టేటస్ చెక్ చేస్తే.. వాట్సాప్‌కు చెందిన కొత్త స్టేటస్ కనిపిస్తోంది. దాని క్లిక్ చేస్తే వాట్సాప్ పంపిన స్టేటస్‌లు కనిపిస్తున్నాయి. యూజర్ ఒకసారి ఈ స్టేటస్ చూసిన తర్వాత.. మళ్లీ స్టేటస్ బార్‌లో ఈ లింక్ కనిపించడం లేదు.

'మీ ప్రైవ‌సీకి క‌ట్టుబ‌డి ఉన్నాం.. మీ ప్రైవేట్ మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ కాబ‌ట్టి వాటిని మేం చూసే, వినే అవకాశం లేదు.. మీరు షేర్ చేసిన లొకేష‌న్‌ మేం చూడ‌ం.. మీ కాంటాక్ట్‌ల‌ను ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోము' అని స్టేటస్‌గా పెట్టి తన యూజర్లకు పంపిస్తోంది. కానీ, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలామంది వాట్సాప్ యూజర్లు.. తమ పర్సనల్ డేటాకు భద్రత లేదని భావించి సిగ్నల్, టెలిగ్రాం యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.

మరి వాట్సప్ ఇస్తున్న హామీలు ఏమిటో మీరు చూడండి..












Show Full Article
Print Article
Next Story
More Stories