పాన్‌కార్డ్‌ని ఆధార్‌ కార్డ్‌తో లింక్‌ చేయకపోతే ఏం జరుగుతుంది..?

What Happens if the PAN card is not Linked to the Aadhaar Card | Telugu Online News
x

పాన్‌కార్డ్‌ని ఆధార్‌ కార్డ్‌తో లింక్‌ చేయకపోతే ఏం జరుగుతుంది..?

Highlights

Aadhaar With Pan: ప్రభుత్వం చాలా రోజుల నుంచి పాన్‌కార్డ్‌ని ఆధార్‌తో లింక్‌ చేసుకోమని చెబుతోంది...

Aadhaar With Pan: ప్రభుత్వం చాలా రోజుల నుంచి పాన్‌కార్డ్‌ని ఆధార్‌తో లింక్‌ చేసుకోమని చెబుతోంది. దానికోసం చాలా రోజులు సమయం కేటాయించింది. అయినా కొంతమంది ఇప్పటికీ చేసుకోవడం లేదు. తాజాగా ఆధార్, పాన్ నంబర్ లింక్ చేయడానికి చివరి తేదీ సమీపిస్తోంది. నిబంధనల ప్రకారం మార్చి 31, 2022లోగా పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి. అలా చేయకుంటే వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30గా నిర్ణయించారు. అయితే దాని గడువు ఇప్పుడు 31 మార్చి 2021 వరకు పొడిగించారు. ఒక వ్యక్తి తన పాన్ కార్డును తన ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే అతను జరిమానా చెల్లించవలసి ఉంటుంది. అంతేకాదు అతని పాన్ కార్డ్ కూడా చెల్లదు. విశేషమేమిటంటే మీరు పాన్ కార్డుతో ఆధార్‌ను చాలా సులభంగా, ఇంట్లో కూర్చొని లింక్ చేసుకోవచ్చు. దాని పూర్తి సమాచారం తెలుసుకోండి..

ఆన్‌లైన్‌లో ఆధార్ పాన్ లింక్

1. ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ incometax.gov.in/ke/foportal కి వెళ్లాలి.

2. ఇందులో ముందుగా మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి. మీ పాన్ నంబర్ మీ యూజర్ ఐడి రిజిస్టర్ అవుతుంది.

3. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వండి.

4. పేజీ ఓపెన్‌కాగానే మీకు లింక్ ఆధార్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఎంపికపై క్లిక్ చేయండి.

5. తర్వాత ఆధార్, పాన్ కార్డ్ సమాచారం అడుగుతుంది. మీ అన్ని వివరాలను నింపండి.

6. మీ ఆధార్, పాన్ కార్డ్ ఇప్పటికే లింక్ చేయబడి ఉంటే మీ పాన్ ఆధార్ నంబర్‌తో లింక్ చేయబడిందని మీకు మెస్సేజ్‌ కనిపిస్తుంది.

SMS ద్వారా పాన్ ఆధార్ లింక్ మీకు కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ సౌకర్యం లేకుంటే మీరు SMS ద్వారా కూడా మీ పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ SMS ఆధారిత సౌకర్యాన్ని ప్రారంభించింది. మీరు UIDPAN<12 డిజిట్ ఆధార్ నంబర్>స్పేస్>>10 డిజిట్ పాన్ నంబర్ వంటి ఈ ఫార్మాట్‌లో మీ వివరాలను టైప్ చేయడం ద్వారా 567678 లేదా 561561కి మెస్సేజ్‌ పంపవచ్చు. తర్వాత లింక్ గురించి మీ మొబైల్‌కి మెస్సేజ్‌ తిరిగి వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories