Currency: క‌రెన్సీ నోట్ల‌పై ఉండే ఈ సింబ‌ల్‌కి అర్థం ఏంటో తెలుసా.?

Currency
x

Currency: క‌రెన్సీ నోట్ల‌పై ఉండే ఈ సింబ‌ల్‌కి అర్థం ఏంటో తెలుసా.?

Highlights

Currency: భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నకిలీ నోట్ల ఉత్పత్తి ఒకటి. ఎన్నో ఏళ్ల నుంచి ఇండియ‌న్ ఎకాన‌మీని ఈ న‌కిలీ నోట్ల దందా దెబ్బ తీస్తూ వ‌స్తోంది.

Currency: భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నకిలీ నోట్ల ఉత్పత్తి ఒకటి. ఎన్నో ఏళ్ల నుంచి ఇండియ‌న్ ఎకాన‌మీని ఈ న‌కిలీ నోట్ల దందా దెబ్బ తీస్తూ వ‌స్తోంది. అయితే డిజిటల్ లావాదేవీల పెరుగుదల వల్ల నకిలీ నోట్లు మిగతా కాలంతో పోలిస్తే తగ్గాయి. క్యాష్‌ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా ఉన్నప్పుడు నకిలీ నోట్ల ప్రమాదం ఎక్కువగా ఉండేది. దీన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనేక రకాల భద్రతా చర్యలు తీసుకుంటోంది.

నోట్లపై సీరియల్ నంబర్ ఎందుకు?

ప్రతి నోటుపై ప్రత్యేకమైన సీరియల్ నంబర్ ఉంటుంది. ఇది యూనిక్ ఐడీలా పనిచేస్తూ, ఒక్కో నోటును వేరుగా గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా అసలైన నోటు, నకిలీ నోటు మధ్య తేడాను గుర్తించడం సులభం అవుతుంది.

స్టార్ మార్క్ఎందుకు ఉంటుంది.?

కొన్ని నోట్ల సీరియల్ నంబర్‌లో స్టార్ (*) గుర్తు కనిపించవచ్చు. దీన్ని చూసి చాలామంది ఆ నోటు నకిలీ అయి ఉండొచ్చని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. RBI ప్రకారం, స్టార్ గుర్తు ఉన్న నోటు అసలు నోటే. కానీ అది రిప్లేస్‌మెంట్ నోటు.

స్టార్ నోట్ అంటే ఏమిటి?

ప్రింటింగ్ సమయంలో కొన్ని నోట్లలో ఎర్రర్లు వస్తే, వాటిని తీసేసి అదే స్థానం కోసం కొత్త నోటును ముద్రిస్తారు. అలా ముద్రించిన రిప్లేస్‌మెంట్ నోటుపై సీరియల్ నంబర్‌తో పాటు స్టార్ గుర్తు ఉంటుంది. ఇది నకిలీ కాదని, కేవలం ఒక రీప్లేస్‌మెంట్ మాత్రమేనని తెలియజేస్తుంది.

స్టార్ నోట్ల చట్టబద్ధత

స్టార్ గుర్తు ఉన్న నోట్లు కూడా మిగతా నోట్లలాగే చట్టబద్ధమైనవే. వీటిని వినియోగించవచ్చు, బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వీటికి ఎలాంటి అదనపు విలువ ఉండదు, కానీ ఇవి అరుదుగా మాత్రమే లభిస్తాయి.

స్టార్ నోట్ల చరిత్ర

2006లో RBI మొదటిసారిగా స్టార్ నోట్లను విడుదల చేసింది. అప్పటి నుంచి 1,000 నోట్ల బ్యాచ్‌లో సగటున 100 నోట్లు స్టార్ గుర్తుతో వస్తుంటాయి. ఇవి ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్లు కలిగి ఉండవు.

కాయిన్స్‌పైనా స్టార్ గుర్తు ఉంటుందా?

ఉండవచ్చు. హైదరాబాద్ మింట్‌లో తయారయ్యే నాణేలపై గుర్తుగా స్టార్ గుర్తు ముద్రిస్తారు. ఇది కాయిన్‌ తయారీ కేంద్రాన్ని సూచించే గుర్తు మాత్రమే.

నకిలీ నోట్లు నివారించేందుకు ఎలాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి?

ఆర్‌బీఐ భారత కరెన్సీ నోట్లలో కొన్ని ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెట్టింది:

దేవనాగరి లిపిలో నంబర్లు, స్వచ్ఛ భారత్ లోగో, రంగు మారే డినామినేషన్ నంబర్, మైక్రో టెక్స్ట్, సెక్యూరిటీ థ్రెడ్, దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన టెక్స్చర్డ్ ప్రింటింగ్, మహాత్మా గాంధీ చిత్రం, వాటర్‌మార్క్‌గా ఎలక్ట్రోటైప్ (100) వంటి గుర్తుల‌తో అస‌లు, న‌కిలీ నోట్ల‌కు మ‌ధ్య తేడాను గుర్తించ‌వ‌చ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories