Indian Railway: ప్రయాణికులకి హెచ్చరిక.. పొరపాటున కూడా ఈ వస్తువులు రైళ్లో తీసుకువెళ్లకూడదు..!

Warning to Passengers Even by Mistake These Items Should not be Carried in the Train
x

Indian Railway:ప్రయాణికులకి హెచ్చరిక.. పొరపాటున కూడా ఈ వస్తువులు రైళ్లో తీసుకువెళ్లకూడదు..!

Highlights

Indian Railway: రైలులో ప్రయాణించేటప్పుడు చాలామంది ఎక్కువ లగేజీని తీసుకువెళుతారు.

Indian Railway: రైలులో ప్రయాణించేటప్పుడు చాలామంది ఎక్కువ లగేజీని తీసుకువెళుతారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. లగేజీ ఎక్కువగా కనిపిస్తే TTE జరిమానా విధించే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు 3 వస్తువులను తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. వీటి గురించి టీటీఈకి తెలిస్తే నేరుగా జైలుశిక్ష, ప్రత్యేకంగా భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.

యాసిడ్‌ బాటిళ్లు

రైలులో యాసిడ్ బాటిల్ తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. ఒక ప్రయాణికుడు ఇలా చేస్తూ పట్టుబడితే రైల్వే చట్టంలోని సెక్షన్ 164 కింద అతన్ని వెంటనే అరెస్టు చేయవచ్చు. అంతేకాదు రూ.1,000 జరిమానా లేదా 3 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. కాబట్టి రైలులో ఎప్పుడూ అలాంటి పొరపాటు చేయకుండా ఉండండి.

గ్యాస్ సిలిండర్

ఇతర ప్రాంతాల్లో పని చేసే వారు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తమతో పాటు స్టవ్‌లు, సిలిండర్లు తీసుకువస్తుంటారు. రైలులో గ్యాస్ సిలిండర్లు, స్టవ్‌లను తీసుకెళ్లడం రైల్వే చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. కచ్చితంగా ఇలా చేయాల్సివచ్చినప్పుడు రైల్వే నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఖాళీ సిలిండర్లను తీసుకెళ్లవచ్చు. నింపిన సిలిండర్ దొరికితే జైలు శిక్ష కఠినమైన జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది.

క్రాకర్స్

రైళ్లలో పటాకులు తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. పటాకులు పేలడం వల్ల రైలులో మంటలు చెలరేగి ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఎవరైనా రైలులో పటాకులు తీసుకెళ్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. అతనికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు. అందువల్ల మీరు అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు.

ఆయుధాలు

మీరు రైలులో లైసెన్స్ పొందిన ఆయుధాలు తప్ప కత్తి, ఈటె, బాకు, రైఫిల్ లేదా మరే ఇతర ప్రాణాంతక ఆయుధాన్ని తీసుకెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల రైల్వే చట్టం, ఆయుధ చట్టం కింద మీపై కేసు నమోదు చేస్తారు. దీని కోసం మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories