Bank to Post Office: ఈ పొదుపు పథకాలని బ్యాంకు నుంచి పోస్టాఫీసుకి మార్చాలనుకుంటున్నారా..!

Want to Transfer Sukanya Samriddhi PPF Accounts From Bank to Post Office Know the Easy Process
x

Bank to Post Office: ఈ పొదుపు పథకాలని బ్యాంకు నుంచి పోస్టాఫీసుకి మార్చాలనుకుంటున్నారా..!

Highlights

Bank to Post Office: స్మాల్ సేవింగ్ స్కీమ్ ఖాతా కింద పెట్టుబడి పెట్టే వ్యక్తులు రిస్క్ లేకుండా వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు.

Bank to Post Office: స్మాల్ సేవింగ్ స్కీమ్ ఖాతా కింద పెట్టుబడి పెట్టే వ్యక్తులు రిస్క్ లేకుండా వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతోపాటు పన్ను మినహాయింపు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. చిన్న పొదుపు పథకాలని బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు మార్చవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు అలాగే పోస్టాఫీసులోని ఒక శాఖ నుంచి మరొక శాఖకు బదిలీ చేయవచ్చు. దీని మొత్తం ప్రాసెస్‌ గురించి తెలుసుకుందాం.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌

ఈ పథకాన్ని బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు అలాగే పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు బదిలీ చేయవచ్చు. ఇందుకోసం ఖాతా ఉన్న బ్యాంకుకు, పోస్టాఫీసుకు వెళ్లాల్సిందే. ఇక్కడ మీరు పూర్తి చిరునామాతో బదిలీ ఫారమ్‌ను పూరించి సమర్పించాలి. దీంతోపాటు జీఎస్టీతోపాటు పాస్ బుక్ కాపీ, రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

పీపీఎఫ్‌ ఖాతా బదిలీ

పీపీఎఫ్‌ ఖాతాను కూడా ఇదే ప్రక్రియ కింద బదిలీ చేయవచ్చు. దీనిని పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు లేదా బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు బదిలీ చేయవచ్చు. దీని కోసం బ్యాంకులు, పోస్టాఫీసులు రూ.100 + GST రుసుము వసూలు చేస్తాయి.

సుకన్య సమృద్ధి ఖాతా బదిలీ

సుకన్య సమృద్ధి ఖాతాను బ్యాంక్ నుంచి పోస్టాఫీసుకు అలాగే పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు బదిలీ చేయడానికి రూ 100 + GST రుసుము చెల్లించాలి. దీంతోపాటు ఇతర పథకాల మాదిరిగానే ఈ పథకాన్ని బదిలీ చేయడానికి పాస్‌బుక్, చిరునామాతో పాటు బదిలీ ఫారమ్‌ను నింపి బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు సమర్పించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories