Start Investment 2024: 2024లో ఇన్వెస్ట్‌మెంట్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారా.. ఈ ఆప్షన్స్‌ గమనించండి..!

Want To Start Investment In 2024 Check Out These Options In the Share Market
x

Start Investment 2024: 2024లో ఇన్వెస్ట్‌మెంట్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారా.. ఈ ఆప్షన్స్‌ గమనించండి..!

Highlights

Start Investment 2024: మీ దగ్గర రూ.4 నుంచి 5 లక్షలు ఉండి కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారా.. అయితే కచ్చితంగా మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే.

Start Investment 2024: మీ దగ్గర రూ.4 నుంచి 5 లక్షలు ఉండి కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారా.. అయితే కచ్చితంగా మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే. మంచి లాభాలు ఆర్జించాలంటే ఇంతకంటే మంచి ప్లాట్‌ఫాం లేదనే చెప్పాలి. ఇందులో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ రోజుల్లో చిన్న పెట్టుబడిదారులు ఇన్వెస్ట్‌ చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. దీని గురించి ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం.

డబ్బును ఇలా పెట్టుబడి పెట్టండి

మ్యూచవల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఎక్కువ భాగాన్ని లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని, మిగిలిన మొత్తాన్ని డెట్ సెక్యూరిటీలలో పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాటి విలువ కొద్ది కొద్దిగా పెరుగుతుంది. అయితే డెట్ ఫండ్స్‌లో దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయాలి. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉంటాయి. మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బుని 70 శాతం, 30 శాతం విభజించి ఇన్వెస్ట్‌ చేయాలి. అంటే రూ.3.5 లక్షలు లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో మిగిలిన రూ.1.5 లక్షలు డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేయాలి.

లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 70 శాతం పెట్టుబడి పెట్టాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇవి అప్పటికే ఖరీదైన స్టాక్‌ల లిస్టులో ఉంటాయి. పెట్టుబడిని దీర్ఘకాలికంగా పెట్టడం వల్ల మంచి లభాలు వస్తాయి. స్వల్పకాలిక పెట్టుబడులపై తక్కువ ఆదాయం, సమయం వృథా అవుతుంది. పెట్టుబడి పెట్టడానికి కొంత మూలధనం ఉన్నప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో జాగ్రత్తగా తెలుసుకోవాలి. లేదంటే మొత్తం కోల్పోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో మార్కెట్‌లో చాలా ఫ్రాడ్స్‌ జరుగుతున్నాయి. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్‌ విషయంలో ఆచితూచి ముందడుగు వేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories