Washing Machine Prices: వాషింగ్‌ మెషీన్‌ కొనాలనుకుంటున్నారా.. ఈ కంపెనీలు తక్కువ ధరకే అందిస్తున్నాయి..!

Washing Machine Prices: ఈ రోజుల్లో మహిళలకు బట్టలు ఉతకడం అనేది అతి పెద్ద టాస్క్‌. దీనికోసం వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది.

Jyothi
Updated on: 22 April 2024 8:31 PM IST
Want to buy a washing machine these companies are offering at a low price
X

Washing Machine Prices: వాషింగ్‌ మెషీన్‌ కొనాలనుకుంటున్నారా.. ఈ కంపెనీలు తక్కువ ధరకే అందిస్తున్నాయి..!

Washing Machine Prices: ఈ రోజుల్లో మహిళలకు బట్టలు ఉతకడం అనేది అతి పెద్ద టాస్క్‌. దీనికోసం వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒంట్లోని ఎనర్జీని మొత్తం కోల్పోవలసి ఉంటుం ది. అందుకే చాలామంది వాషింగ్‌ మెషీన్లు కొనడానికి ప్రయత్నిస్తారు. కానీ మార్కెట్‌లో వాటి ధరలు అధికంగా ఉండడం వల్ల కొనుగోలు చేయలేకపోతారు. ఇప్పుడు ఇక ఆ చింత అవసరం లేదు. ఎందుకంటే చాలా కంపెనీలు రూ. 150000 లోపు వాషింగ్‌ మెషీన్లను అందిస్తున్నాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

1. Whirlpool 7 kg: మీరు ఈ 5 స్టార్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్‌ను 21 శాతం తగ్గింపుతో కేవలం రూ. 14,990కి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో పొందవచ్చు. మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించినట్లయితే రూ. 2000 వరకు అదనంగా తగ్గింపు పొందుతారు.

2. Bosch 7.5KG: ఇది 5 స్టార్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్. దీన్ని అమెజాన్‌లో 24 శాతం తగ్గింపుతో కేవలం రూ. 12,490కి పొందవచ్చు.

3. Godrej 6.5 kg: మీరు ఈ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను 24 శాతం తగ్గింపుతో కేవలం రూ. 13,290కే పొందవచ్చు. గోద్రేజ్ కంపెనీకి చెందిన ఈ వాషింగ్ మెషీన్‌పై ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఉంటుంది.

4. Panasonic 6 kg: పానాసోనిక్‌ కంపెనీకి చెందిన ఈ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ అసలు ధర రూ. 20,000 అయితే దీనిని 31 శాతం తగ్గింపుతో కేవలం రూ. 13,790కే కొనుగోలు చేయవచ్చు. మీరు దీనిపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ కూడా పొందుతారు.

5. Panasonic 6.5 kg: ఈ వాషింగ్ మెషీన్ పైన పేర్కొన్న మెషీన్ల వలె పూర్తిగా ఆటోమేటిక్ మెషీన్ కాదు. ఇది అమెజాన్‌లో రూ. 9,290కి పొందవచ్చు. ఇది సెమీ ఆటోమేటిక్ మెషీన్.

Jyothi

Jyothi

Next Story