భారత్‌ మార్కెట్‌ నుంచి వోడాఫోన్‌ ఇక తప్పకున్నట్టేనా?

భారత్‌ మార్కెట్‌ నుంచి వోడాఫోన్‌ ఇక తప్పకున్నట్టేనా?
x
Highlights

టెలికామ్‌ దిగ్గజం ఒకటి భారతీయ మార్కెట్‌ నుంచి ఎగ్జిట్‌ కాబోతోంది. ఏంటా అనుకుంటున్నారా వోడాఫోన్‌. బ్రిటిష్‌ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ ఈ ఘంటికలే...

టెలికామ్‌ దిగ్గజం ఒకటి భారతీయ మార్కెట్‌ నుంచి ఎగ్జిట్‌ కాబోతోంది. ఏంటా అనుకుంటున్నారా వోడాఫోన్‌. బ్రిటిష్‌ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ ఈ ఘంటికలే మోగించింది. అవును పదేళ్ల కింద జూజూ యాడ్స్‌తో మనందరి మదిని దోచిన వోడాఫోన్‌లో మన వాయిస్‌ ఇక వినిపించేదేమో. తాజాగా ఈ కంపెనీకి చెందిన టాప్ మేనేజ్‌మెంట్ ఇస్తున్న సంకేతాల్ని చూస్తుంటే అలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అనిపిస్తుంది. సుప్రీంకోర్టు తాజా తీర్పును అమలు చేయాలంటే ఆ కంపెనీ భారత్ నుంచి వైదొలగటానికి మించి మరో అవకాశం లేదంటున్నది వోడాఫోన్‌ చెబుతున్న మాట.

నిజం చెప్పాలంటే సుప్రీంకోర్టు తీర్పుతో టెల్కోలకు గట్టి దెబ్బే పడనుంది. ఆ దెబ్బ వోడాఫోన్‌ మీద ఇంకాస్త ఎక్కవ ప్రభావమే చూపనుంది. పరిస్థితులు అనుకూలించకపోతే త్వరలో భారత మార్కెట్‌ నుంచి వైదొలగాల్సి రావచ్చు. టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిల విషయంలో ప్రభుత్వం కొంత ఊరట కల్పించాలని, లేదంటే భారత్‌లో కంపెనీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంలో పడనుందని వొడాఫోన్‌ గ్రూపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిక్‌ రీడ్‌ అన్నారు. ఏ మాత్రం మద్దతు లేని నిబంధనలు, అధిక పన్నుల వల్ల వోడాఫోన్‌ కంపెనీ ఆర్థికంగా పెను భారాన్ని మోస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలతను మరింత పెంచింది. దీనికి కారణం లేకపోలేదు. వొడాఫోన్‌ ఐడియా జాయింట్‌ వెంచర్ వల్ల నష్టాలు భారీగా పెరిగిపోయాయి. ప్రతినెలా లక్షల సంఖ్యలో కస్టమర్లు ఈ కంపెనీ నెట్‌వర్క్‌ను వీడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కంపెనీ మార్కెట్‌ విలువ భారీగా పతనమైంది.

వోడాఫోన్‌కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అసలేంటీ బకాయిల వివాదం దీనిపై కాస్త లోతుగా మాట్లాడుకుందాం. AGR అంటే Adjusted Gross Revenue ఇంకా క్లియర్‌గా అర్థమవ్వాలంటే సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం పద్ధతిన లైసెన్సు, ఇతర ఫీజుల లెక్కింపుపై పదేళ్ల క్రితం టెలికాం శాఖ, టెల్కోల మధ్య వివాదం మొదలైంది. ఈ వివాదంపై టీడీశాట్ అంటే Tele Communications Dispute Settlement Appellate Tribunal టెలికాం కంపెనీలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ వాదనకు మద్దతు తెలిపింది. వచ్చే మూడు నెలల్లో AGR అంటే Adjusted Gross Revenue బకాయిలను అసలు, వడ్డీ, జరిమానా, దానిపైనా వడ్డీతో సహా చెల్లించాలని గతనెల 24న కోర్టు టెల్కోలను ఆదేశించింది. ఈ తీర్పుతో ఎయిర్‌టెల్‌ 21 వేల 7 వందల కోట్లు, వొడాఫోన్‌ ఐడియా జాయింట్‌ వెంచర్‌ 28 వేల 3 వందల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏ లెక్కన చూసుకున్నా సుప్రీం తీర్పు వల్ల ఇండస్ట్రీపై మొత్తం లక్షా 4 వేల కోట్ల భారం పడింది.

ఏ నెలకు ఆనెల లక్షలాది మంది కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌లకు మారిపోతుండటం ఒక పెద్ద సమస్య అయితే కంపెనీ ఆర్థికస్థితిని తీవ్రంగా ప్రభావితం చేసే సుప్రీంకోర్టు వల్ల కంపెనీ సంచలన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. భారత్ మార్కెట్లో సవాళ్లు బలంగా ఉన్నాయని వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం లేదన్న మాట వినిపిస్తోంది. 28 వేల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని చెల్లించే పరిస్థితుల్లో వోడాఫోన్ లేదు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని కంపెనీ చెల్లించాల్సిన మొత్తాన్ని భారీ ఎత్తున తగ్గిస్తే తప్పించి కంపెనీ భారత్‌లో కొనసాగే వీలు లేదు. వోడాఫోన్ భవితవ్యం కేంద్ర సర్కారు చేతిలో ఉందన్న విషయం ఇక్కడ స్పష్టం. మరేం జరుగుతుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories