Alert: ఫోన్‌ ఎత్తితే అకౌంట్‌ ఖాళీ.. జాగ్రత్తగా లేకుంటే భారీ మూల్యం చెల్లించాల్సిందే..!

Vishing Bank Fraud Check for all Details
x

Alert: ఫోన్‌ ఎత్తితే అకౌంట్‌ ఖాళీ.. జాగ్రత్తగా లేకుంటే భారీ మూల్యం చెల్లించాల్సిందే..!

Highlights

Alert: ఈరోజుల్లో చాలామంది బ్యాంకింగ్ పనులన్నింటినీ ఆన్‌లైన్‌,స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా చేస్తున్నారు.

Alert: ఈరోజుల్లో చాలామంది బ్యాంకింగ్ పనులన్నింటినీ ఆన్‌లైన్‌,స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా చేస్తున్నారు. అయితే వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సైబర్‌ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నేరస్తులు తెలివిగా సమాచారం సేకరించి బ్యాంకు ఖాతాను నిమిషాల్లో ఖాళీ చేస్తున్నారు. దీని కోసం వివిధ పద్దతులని అనుసరిస్తున్నారు. అందులో ఒకటి విషింగ్‌ పద్దతి. దీనిని ఎలా నివారించాలా ఈరోజు తెలుసుకుందాం.

విషింగ్‌ పద్దతి అంటే ఏమిటి?

విషింగ్‌లో (Vishing)నేరస్థుడు ఫోన్ కాల్ ద్వారా మీ నుంచి సీక్రెట్‌ విషయాలని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వినసొంపైన మాటలతో మిమ్మల్ని నమ్మిస్తాడు. తాము బ్యాంకు ప్రతినిధులమని చెప్పుకుంటూ వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టుకుంటారు. వీటిలో వినియోగదారు ID, లాగిన్, పాస్‌వర్డ్, OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్), ఏటీఎం కార్డ్ పిన్, CVV లేదా పుట్టిన తేదీ, తల్లి పేరు మొదలైన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. తర్వాత మీ ఖాతానుంచి డబ్బు దొంగిలించడానికి ఈ వివరాలని ఉపయోగిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ నిమిషాల్లో పూర్తవుతుంది.

ఈ చిట్కాలను అనుసరించండి

1. మీ వ్యక్తిగత వివరాలని ఎవరికీ షేర్‌ చేయవద్దు. మొదటి, చివరి పేరు వంటి వ్యక్తిగత వివరాలను అడిగే కాలర్ పట్ల జాగ్రత్తగా ఉండండి.

2. ఏదైనా మెస్సేజ్‌ ద్వారా వచ్చిన ఫోన్‌ నంబర్‌కు కాల్ చేయవద్దు. వ్యక్తిగత లేదా ఖాతా వివరాలను చెప్పొద్దు.

3. ఏదైనా ఈ మెయిల్‌లో వచ్చిన నంబర్‌కు కాల్ చేయవద్దు.

4. ఏదైనా నెంబర్‌కి కాల్‌ చేసేటప్పుడు అది బ్యాంకు నెంబరా కాదా విషయాన్ని ధృవీకరించుకోవడం ఉత్తమం.

5. మీరు క్రెడిట్ లేదా డెబిట్ సమాచారం కోసం ఏదైనా SMS లేదా కాల్‌ని స్వీకరిస్తే ఎటువంటి సమాచారాన్ని తెలియజేయవద్దు.

6. మీకు ఏ సమాచారం కావాలన్నా దగ్గరలోని బ్యాంకుని సంప్రదించడం అన్నివిధాల శ్రేయస్కరమని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories