పండగ సందర్భంగా ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్.. వడ్డీ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Unity Small Finance Bank Special FD Scheme Shagun 501 Check for all Details
x

పండగ సందర్భంగా ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్.. వడ్డీ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Highlights

Special FD: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ చాలా ప్రయత్నిస్తోంది.

Special FD: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ చాలా ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ 30న వరుసగా నాలుగోసారి రెపో రేటును పెంచింది. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 5.90 శాతానికి చేరుకుంది. దీంతో బ్యాంకులు రుణ వడ్డీ రేట్లు, డిపాజిట్ రేట్లను పెంచడం ప్రారంభించాయి. అయితే దసరా, దీపావళి పండగల సందర్భంగా యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ తన పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది.

ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 8.40% వరకు వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే సాధారణ పౌరులకు బ్యాంక్ 7.90% వరకు వడ్డీ రేటును అందిస్తోంది. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ ఈ స్పెషల్ ఎఫ్‌డి స్కీమ్ గురించి ట్వీట్ చేసింది. ఈ ప్రత్యేక FDకి 'షాగున్ 501' అని పేరు పెట్టింది. ఈ FD పథకం పూర్తి 501 రోజులు. మీరు ఈ పథకంలో 1 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ 2022 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిరంతరం పెద్ద చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు రెపో రేటు 5.40% నుంచి 5.90%కి పెరిగింది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రజల రుణాల ఈఎంఐపైనా, డిపాజిట్ ఖాతా వడ్డీ రేట్లపైనా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. RBI ఈ నిర్ణయంతో ICICI బ్యాంక్, RBL బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, DCB బ్యాంక్ మొదలైన అనేక బ్యాంకులు ఇటీవల తమ FD రేట్లను పెంచాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories