Union Budget 2026 Live Updates: పార్లమెంట్​లో నిర్మల బడ్జెట్​ ప్రసంగం.. లైవ్ అప్ డేట్స్

Union Budget 2026 Live Updates: ఫిబ్రవరి 1, అనగా ఈరోజు ఉదయం 11 గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి యూనియన్ బడ్జెట్ 2026 ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం ఏఏ రంగాలకి ఎంత బడ్జెట్ ని కేటాయించారో ఆర్థిక మంత్రి వివరించనున్నారు. అలాగే ఆదాయపు పన్నుకి సంబంధించి కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. బడ్జెట్ ఎలా ఉంటుందో లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూద్దాం.

Show Full Article

Live Updates

  • 1 Feb 2026 6:00 AM GMT

    Union Budget 2026 Live Updates: క్యాపెక్స్‌ను రూ.12.2 లక్షల కోట్లకు పెంచనున్న ఆర్థిక మంత్రి

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాపిటల్ ఎక్స్పెండిచర్ (CAPEX) ను రూ. 12.2 లక్షల కోట్లకు పెంచడానికి ప్రతిపాదించారు.

    మౌలిక సదుపాయాల వ్యయానికి CAPEX కేటాయింపును కొనసాగిస్తూ, రుణదాతలకు క్రెడిట్ గ్యారంటీ కోసం మౌలిక సదుపాయాల రిస్క్ గ్యారంటీ నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

    కొత్త సరుకు రవాణా కారిడార్‌లను ఏర్పాటుచేయాలని, ప్రత్యేక REITలను ఏర్పాటు చేసి CPSE ఆస్తులను రీసైకిల్ చేయాలని ప్రతిపాదించారు.

    ఒడిశాలో ఒక ప్రాజెక్ట్‌తో ప్రారంభించి, మొత్తం 20 కొత్త జలమార్గాలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

    ప్రజా మూలధన వ్యయం 2014-15లో రూ. 2 లక్షల కోట్ల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 11.2 లక్షల కోట్లకు పెరిగింది.

    వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఊపును కొనసాగించడానికి CAPEX ను రూ. 12.2 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు మంత్రి చెప్పారు.

  • 1 Feb 2026 5:54 AM GMT

    Union Budget 2026 Live Updates:200 లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్ల పునరుజ్జీవనం – నిర్మలా సీతారామన్

    భారతదేశం క్రీడా వస్తువుల ఉత్పత్తి కేంద్రంగా ప్రపంచ స్థాయిలో ఎదగగల సామర్థ్యం కలిగిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

    దేశంలోని 200 లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్లను పునరుజ్జీవనం చేసి, ఆర్థిక కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని మంత్రి ప్రకటించారు.

  • 1 Feb 2026 5:51 AM GMT

    Union Budget 2026 Live Updates:3 కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించిన నిర్మలా సీతారామన్

    కర్తవ్యం 1: సమ్మిళిత ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం.

    కర్తవ్యం 2: అభివృద్ధిలో ప్రజల సક્રియ భాగస్వామ్యాన్ని కల్పించడం.

    కర్తవ్యం 3: ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ ధోరణిలో సంస్కరణలతో కూడిన అభివృద్ధి మంత్రాన్ని అమలు చేయడం.

    ఫిస్కల్ డిసిప్లిన్‌ను సాధించామని ప్రకటించారు.

    జనవరిలో జీఎస్టీ కలెక్షన్లు రూ. 1.93 లక్షల కోట్లు చేరడం ద్వారా ఎకానమీ స్థిరత్వం ఏర్పడింది.

    ద్రవ్యోల్బణం మోడరేట్ స్థాయిలో ఉందని పేర్కొన్నారు.

  • 1 Feb 2026 5:48 AM GMT

    Union Budget 2026 Live Updates:ఎలక్ట్రానిక్ భాగాల తయారీ పథకానికి భారీ కేటాయింపు

    ఎలక్ట్రానిక్ భాగాల తయారీ పథకం కోసం వ్యయాన్ని రూ. 40,000 కోట్లకు పెంచారు.

    రాబోయే 5 సంవత్సరాల్లో బయో ఫార్మా రంగానికి రూ. 10,000 కోట్ల ప్రతిపాదనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

    ఎలక్ట్రానిక్ మరియు బయో ఫార్మా రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా పరిశ్రమ, ఉత్పత్తి శక్తిని బలోపేతం చేయడం లక్ష్యం.

  • 1 Feb 2026 5:47 AM GMT

    Union Budget 2026 Live Updates: ‘సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్’ ధోరణిలో రూపుదిద్దిన బడ్జెట్

    కర్తవ్యభవన్‌లో రూపొందించిన ఇది నిర్మలా సీతారామన్ మూడో బడ్జెట్.

    నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతల ద్వారా భారత్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళే లక్ష్యం.

    అభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఉండేలా ప్రత్యేక శ్రద్ధ.

    2025 ఆగస్టు తర్వాత 350 కీలక సంస్కరణలు అమలు చేశారు.

    ఆర్థిక ప్రణాళికలు అంతర్జాతీయ పరిణామాల ప్రభావంలో రూపుదిద్దబడ్డాయి.

    జీఎస్టీ, లేబర్ కోడ్ మరియు ఇతర రంగాల్లో సంస్కరణలను ప్రవేశపెట్టారు.

  • 1 Feb 2026 5:42 AM GMT

    Union Budget 2026 Live Updates:ప్రజల మద్దతుతో రూపుదిద్దిన యువశక్తితో కూడిన ‘వికసిత్ భారత్ 2047’ బడ్జెట్

    బడ్జెట్ పార్ట్–A ప్రసంగంలో భాగంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వంతో బలంగా నిలిచారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వికసిత్ భారత్‌–2047 లక్ష్యాన్ని సాధించే దిశగా కొత్త నాయకత్వం, యువశక్తితో కూడిన బడ్జెట్ రూపకల్పనకు ప్రోత్సాహం లభించిందని ఆమె తెలిపారు.

    కర్తవ్య భవన్‌లో రూపొందించిన తొలి బడ్జెట్ ఇదేనని పేర్కొన్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, పోటీ తత్వాన్ని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధితో పాటు అందరికీ అభివృద్ధిని చేరవేయడమే ఈ బడ్జెట్ ఉద్దేశమని తెలిపారు.

    అలాగే నిర్మాణాత్మక సంస్కరణలు అమలు చేస్తామని, ప్రజల్లో సేవింగ్స్‌ను పెంచే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలను ప్రోత్సహిస్తూ దేశాన్ని భవిష్యత్తు దిశగా తీసుకెళ్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

  • 1 Feb 2026 5:39 AM GMT

    Union Budget 2026 Live Updates: మాఘ పూర్ణిమ శుభదినంలో ప్రారంభమైన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం

    మాఘ పూర్ణిమ సందర్భంగా కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. మాఘ పూర్ణిమతో పాటు గురు రవిదాస్ జయంతి వంటి శుభదినాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.


     



  • 1 Feb 2026 5:35 AM GMT

    Union Budget 2026 Live Updates: చరిత్రలో మరో అధ్యాయం 9వసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది ఆమె వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కావడం విశేషం.

  • 1 Feb 2026 5:27 AM GMT

    Union Budget 2026 Live Updates: కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన బడ్జెట్, ఉదయం 11కి లోక్‌సభలో ప్రవేశం

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేబినెట్ ఆమోదం పొందడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను కేబినెట్ ముందు ఉంచగా, స్వల్ప చర్చ అనంతరం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో కొద్ది నిమిషాల్లో లోక్‌సభ ప్రారంభం కానుండగా, ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు.

  • 1 Feb 2026 5:20 AM GMT

    Union Budget 2026 Live Updates: పార్లమెంట్‌కు ప్రధాని మోదీ.. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశం

    పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.

Print Article
Next Story
More Stories