
టారీఫ్స్‌పై ట్రంప్ మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని.. ఆటలు ఆడాలనుకునే దేశాలుపై భారీ టారీఫ్స్ తప్పవని హెచ్చరించారు.
Trump టారీఫ్స్: అధ్యక్షుడు ట్రంప్ విధించిన అత్యవసర సుంకాలను ఈరోజు నుండి అమెరికా ప్రభుత్వం నిలిపివేయనుంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం దేశాలను సుంకాల ఒప్పందం నుండి వైదొలుగుతామని హెచ్చరించారు.
వాణిజ్య ఒప్పందం పేరుతో అమెరికాతో "గేమ్స్" ఆడటానికి ప్రయత్నించే ఏ దేశమైనా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని, మరింత ఎక్కువ సుంకాలను విధించడానికి దారితీస్తుందని ఆయన అన్నారు. వాస్తవానికి, యుఎస్ సుప్రీంకోర్టు ఈ సుంకాలను మూడు రోజుల ముందే చట్టవిరుద్ధమని ప్రకటించింది. యుఎస్ కస్టమ్స్ - బోర్డర్ ప్రొటెక్షన్ (CPB) ఒక ప్రకటనలో ఇలా చెప్పింది: “1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విధించిన ఈ సుంకాలు మంగళవారం (IST కాలమానం ప్రకారం ఉదయం 10:30) నుండి ఆగిపోతాయి. ఈ సుంకాలకు సంబంధించిన అన్ని కోడ్‌లను వారి కార్గో వ్యవస్థల నుండి తొలగించాలని ఏజెన్సీ దిగుమతిదారులకు సూచించింది.”
అమెరికా వెనక్కి ఇవ్వాల్సి రావచ్చు..
పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్‌లోని ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం.. ఈ కోర్టు నిర్ణయంతో అమెరికా ప్రభుత్వం $175 బిలియన్ల (రూ. 15.75 లక్షల కోట్లు) కంటే ఎక్కువ ఆదాయాన్ని తిరిగి ఇవ్వవలసి వస్తుంది. అలాగే, రాయిటర్స్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, IEEPA కింద విధించిన సుంకాల వల్ల US కి రోజుకు $500 మిలియన్ (రూ. 4,500 కోట్లు) కంటే ఎక్కువ నష్టం వాటిల్లింది. ఇప్పుడు ఈ సుంకాలు రద్దు చేసినందువాళ్ళ కంపెనీలు వాపసు కోరవచ్చు.
స్పష్టత లేదు
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మూడు రోజుల తర్వాత ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. ఈ మూడు రోజుల్లో సుంకాలు ఎందుకు వసూలు చేస్తున్నారు అనేది ఏజెన్సీ వివరించలేదు. డబ్బు అందుకున్న వారికి వాపసు లభిస్తుందా లేదా అనే విషయం కూడా స్పష్టం చేయలేదు.
ఈ ఆదేశం IEEPA చట్టం కింద విధించిన సుంకాలకు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుంది అంటున్నారు. అయితే, జాతీయ భద్రత పేరుతో సెక్షన్ 232, అన్యాయమైన వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద విధించిన సుంకాలు అమలులో ఉంటాయి. ఈ తీర్పు ద్వారా ప్రభావితం కావని అక్కడి అధికారులు చెబుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




