Trending News :ఉల్లిపాయలనూ ప్రచారానికి వాడేస్తున్నారు..

Trending News :ఉల్లిపాయలనూ ప్రచారానికి వాడేస్తున్నారు..
x
Highlights

ప్రచారం చేసుకోవాలంటే డబ్బుంటే సరిపోదు.. సామాజికాంశాలను సరిగ్గా వాడుకోవడం తెలిసుండాలి. ఆ విద్యలో అమూల్ డే అగ్రస్థానం.

కాదేదీ కవిత కనర్హం అన్నారు మహా కవి శ్రీశ్రీ. ఇప్పుడు అది కాదేదీ ప్రచారానికి అనర్హం అని మార్చుకోవాలేమో! అవును. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిన్న విషయం విపరీతంగా ప్రజల వద్దకు రకరకాల కోణాల్లో చేరిపోతోంది. చిన్న సంఘటన కూడా వైరల్ అయిపోతోంది. మరి నిత్యావసర వస్తువు విషయంలో వచ్చే ఇబ్బంది అయితే ఇక చెప్పక్కర్లేదు. క్రియేటివిటీకి పదును పెట్టేస్తున్నారు అందరూ. ఆ కోవలోకి ఉల్లి ధరలు వచ్చి చేరాయిప్పుడు. కిలో ఉల్లిపాయలు రెండొందలు దాటిపోయినా సందర్భాలు చూస్తున్నామిప్పుడు. సరిగ్గా, ఈ పెరిగిన ఉల్లి ధరలను తమ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి కొన్ని సంస్థలు.

అమూల్ పేరు వినని వారుండరు. అమూల్ పాల ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందొ చెప్పక్కర్లేదు. అమూల్ ఉత్పత్తులకు ఎంత ఆదరణ ఉంటుందో అమూల్ ప్రచార చిత్రాలకూ అంతే ఆదరణ ఉంటుంది. ఎందుకంటే, సామాజికాంశాలను తమ ప్రచార చిత్రాలలో పొందు పరుస్తూ.. ఒక్కోసారి ఆలోచించేలా.. మరోసారి నవ్వుకునేలా తమ ఉత్పత్తుల ప్రచారంలో వాడుకుంటుంది అమూల్. రాజకీయ పరిణామాల దగ్గర నుంచి సమాజంలో వచ్చే చిన్న చిన్న మార్పులనూ అత్యంత చక్కగా ఉపయోగించుకుంటుంది అమూల్. ఇప్పుడు ఉల్లిని వాడేసింది. తాజాగా అమూల్ విడుదల చేసిన ఉల్లికి సంబంధించిన యాడ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన తొలి చిత్రం ''కహోనా ప్యార్ హై'' టైటిల్ ను అమూల్ ఇప్పుడు వాడేసుకుంది. ఎలానో తెలుసా.. ''కహోం నా ప్యాజ్ హై'' అంటూ ప్రచార చిత్రాన్ని రూపొందించింది. ఆ చిత్రం పై భాగంలో ఈ టైటిల్ ఉంచిన అమూల్ కింద అమూల్ మిమ్మల్ని ఏడిపించదు అనే ట్యాగ్ ఇచ్చారు. అమూల్ పాప చేతిలో ఉల్లిపాయలతో ఆడుకుంటున్న ఇమేజి ఆ చిత్రంలో పొందు పరిచారు. ఇది ఎంతలా పేలిందంటే.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది ట్రెండింగ్ గా మారిపోయింది.

ట్రెండింగ్ మారిన ఈ ప్రచార చిత్రం పై ట్విట్టర్ లో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ కామెంట్లు కూడా అత్యంత సమయస్ఫూర్తి తో ఉండటం గమనార్హం. ఒకాయన ఈ ఫోటోకి ''ప్రేమా, ఉల్లిపాయలూ రెండూ కన్నీళ్లకు కారణమవుతాయి'' అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇది కూడా వైరల్ గా షేర్ అవుతోంది. ఇక కొంత మంది మా కంట కన్నీరు రానీయను అంటే లీటరు పాలు కొంటె ఉల్లిపాయలు ఫ్రీగా ఇస్తారా అంటూ సెటైర్ వేస్తున్నారు. మొత్తమ్మీద అమూల్ ఉల్లిపాయల ప్రచారం అదరగొట్టేస్తోందనే చెప్పాలి.




ఇదిలా ఉంటె..మీ పేస్టులో ఉప్పుందా తరహాలో.. మీ షాంపూలో ఉల్లిపాయలున్నాయా? అంటోంది మీరా షాంపూ. అవును ఉల్లిపాయలు ఇప్పుడు ట్రెండింగ్ ప్రచార పదం. అందుకే మీరా షాంపూ ఉల్లిపాయలున్న షాంపూ.. ఉల్లిపాయలు చుండ్రును దూరం చేస్తాయంటూ ప్రచార చిత్రాన్ని వదిలింది.. అదికూడా ఓ లుక్కేయండి..




Show Full Article
Print Article
More On
Next Story
More Stories