Petrol and Diesel Prices Today: దేశవ్యాప్తంగా స్థిరంగా , నిలకడగా ఇంధన ధరలు

Petrol and Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 28 May 2021 10:29 AM IST
Today Petrol Price in Telangana Andhra Pradesh Diesel Price in Hyderabad 28 05 2021
X

దేశవ్యాప్తంగా స్థిరంగా , నిలకడగా ఇంధన ధరలు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Petrol and Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా ఈరోజు పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే గురువారం దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర 9 పైసలు డీజిల్ ధర 17 పైసలు చొప్పున పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 97.36 వద్దకు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 92.24 వద్ద కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 93 రూపాయల 68 పైసలుగా వుండగా డీజిల్ ధర 84 రూపాయల 61 పైసలు వద్దకి చేరింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చిత్తూరు,నెల్లూరు,శ్రీకాకుళం జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది. ఆదిలాబాద్, నిజామాబాద్ ,గద్వాల సహా ఏపీలోని మిగతా అన్ని జిల్లాల్లో వంద రూపాయలకు చేరువలో పరుగులు పెడుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story