Petrol and Diesel Price: వాహనదారులకు షాక్‌.. మరోసారి భగ్గుమన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Petrol and Diesel Price: దేశంలో పెట్రో ధరల భగభగలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 11 Jun 2021 10:27 AM IST
Today Petrol Price in Telangana Andhra Pradesh Diesel Price in Hyderabad 11 06 2021
X

Petrol and Diesel Price: వాహనదారులకు షాక్‌.. మరోసారి భగ్గుమన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Petrol and Diesel Price: దేశంలో పెట్రో ధరల భగభగలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర అక్షరాలా 102 రూపాయల మార్క్ ను దాటింది. ముంబై లో లీటర్ పెట్రోల్ 102 రూపాయల 04 పైసల వద్దకు చేరగా డీజిల్ ధర 94 రూపాయల 15 పైసలుగా నమోదయింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 95 రూపాయల 85 పైసలుగా వుండగా డీజిల్ ధర 86 రూపాయల 75 పైసలు వద్దకి చేరింది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 99.62 వద్దకు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 94.57 వద్ద కొనసాగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల రోజుల వ్యవధిలో మే 4 నుంచి జూన్‌ 11 వరకు 23 సార్లు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story