Petrol and Diesel Price: స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు..

Petrol and Diesel Price: దేశంలో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 10 Jun 2021 11:38 AM IST
Today Petrol Price in Telangana Andhra Pradesh Diesel Price in Hyderabad 10 06 2021
X

(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Petrol and Diesel Price: దేశంలో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర అక్షరాలా 101 రూపాయల మార్క్ ను దాటింది. ముంబై లో లీటర్ పెట్రోల్ 101 రూపాయల 76 పైసల వద్దకు చేరగా డీజిల్ ధర 93 రూపాయల 85 పైసలుగా నమోదయింది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 95 రూపాయల 56 పైసలుగా వుండగా డీజిల్ ధర 86 రూపాయల 47 పైసలు వద్దకి చేరింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 99.31 వద్దకు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 94.26 వద్ద కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story