Petrol and Diesel Price: స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు..

Petrol and Diesel Price: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 7 Jun 2021 11:26 AM IST
Today Petrol Price in Telangana Andhra Pradesh
X

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Petrol and Diesel Price: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా సోమవారం పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఈనెల నాలుగో తేదీన పెట్రోల్ పై 28 పైసలు డీజిల్ పై 30 పైసలు చొప్పున పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 98.48 వద్దకు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 93.38 వద్ద కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 94 రూపాయల 76 పైసలుగా వుండగా డీజిల్ ధర 85 రూపాయల 66 పైసలు వద్దకి చేరింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది. తెలగాణలోని అన్ని జిల్లాల్లో వంద రూపాయలకు చేరువలో పరుగులు పెడుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story