Petrol Diesel Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

Petrol Diesel Price Today: నేడు పెట్రోల్, డీజల్‌పై వరుసగా రూ.36 పైసలు, రూ.26 పైసల మేర పెంచాయి.

Kranthi
Published on: 27 Jun 2021 10:38 AM IST
Today Petrol Price in Hyderabad Rajahmundry Diesel Price Today 27 06 2021
X

Petrol Diesel Price Today:(File Image)

Petrol Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించని కేంద్రం... ఇప్పుడు ధరలు పెంచడానికి మాత్రం అంతర్జాతీయ ధరలే కారణమని చెబుతోంది. వీటికి తోడు కేంద్రం, రాష్ట్రాలు వేసే పన్నుల వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై విపరీతమైన భారం పడుతోంది. మరోవైపు ఈ ధరల వలన రవాణా చార్జీలు కూడా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అసలే సంక్షోభం.. ఆ పై కోవిడ్ దెబ్బ.. వీటితో కుదేలైన సామాన్యుడు.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో తీవ్రంగా దెబ్బ తింటున్నాడు.

కాని దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలనే కారణమని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొస్తున్నారు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల.. ఒక లీటర్ పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ కొట్టి ముందుకు దూసుకెళుతున్నాయి. ఆదివారం పెట్రోల్, డీజల్‌పై వరుసగా రూ.36 పైసలు, రూ.26 పైసల మేర పెంచాయి.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్ రూ.98.47 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.91కి చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.49, డీజిల్ ధర రూ. 93.46 లు వుండగా, ముంబైలో పెట్రోల్ ధర రూ. 104.56, డీజిల్ ధర రూ. 96.42 లు వుండగా, బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.75, డీజిల్ రూ. 94.25 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో …

హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.102.32కి చేరగా, డీజిల్‌ ధర రూ.96.90లు పెరిగింది. 55 రోజుల్లో పెట్రోల్‌పై లీటరు కు రూ.8.07 పెరగగా, డీజిల్‌పై రూ.8.38 పెంచాయి చమురు కంపెనీలు. మే 4 నుంచి నేటి వరకు దాదాపు 31 సార్లు ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

Kranthi

Kranthi

Next Story