Petrol and Diesel Price Today: మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

*లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, లీటర్ డీజిల్‌పై 35 పైసలు పెంపు *హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.110.08, డీజిల్ ధర రూ.103.15

Shilpa
Published on: 17 Oct 2021 8:57 AM IST
Today Petrol Price in Hyderabad Delhi Mumbai Diesel Price Today 17 10 2021
X

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు(ఫైల్ ఫోటో)

Petrol and Diesel Price Today: దేశంలో పెట్రో ధరల మోత కొనసాగుతోంది. వరుసగా దేశంలో చమురు సంస్థలు పెట్రో ధరలు పెంచుతున్నాయి. ఇవాళ లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, లీటర్ డీజిల్‌పై 35 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 110 రూపాయలు దాటింది. లీటర్ డీజిల్ ధర 103 రూపాయల 15 పైసలకు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 105కు చేరువవగా డీజిల్ ధర 93 రూపాయల 52 పైసలకు చేరింది. ఇక ముంబైలో ఇవాళ పెట్రోల్‌పై 34 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచారు. దీంతో ముంబైలో లీటర్ పెట్రోల్ 112కు చేరువైంది.

Shilpa

Shilpa

Next Story