Petrol and Diesel Price Today: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

*మూడు వారాల్లో డీజిల్ 18 సార్లు, పెట్రోల్ ధర 15 సార్లు పెంపు *తాజాగా లీటర్ పెట్రోల్‌ 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంపు

Shilpa
Published on: 16 Oct 2021 9:25 AM IST
Today Petrol Price in Hyderabad Delhi Mumbai Diesel Price Today 16 10 2021
X

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు(ఫైల్ ఫోటో)

Petrol and Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 18 సార్లు పెరగ్గా పెట్రోల్ ధరలు 15 సార్లు ఎగబాకాయి. తాజాగా లీటర్ పెట్రోల్ 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ ధర 109.73, లీటర్ డీజిల్ ధర 102.80 రూపాయలకు చేరింది. దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 35 పైసలు పెరగడంతో 104.79 రూపాయలకు చేరుకోగా, డీజిల్ ధర 93.52 రూపాయలకు పెరిగింది. ముంబైలో లీటరు పెట్రోలుపై 37 పైసలు పెరగడంతో రికార్డు స్థాయిలో 110.75 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధర కూడా సెంచరీ దాటేసి 101.40 రూపాయలకు పెరిగింది. పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలకు పైనే ఉంది.

Shilpa

Shilpa

Next Story