Petrol and Diesel Prices Today: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol and Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి.

Arun Chilukuri
Published on: 27 May 2021 10:46 AM IST
Today Petrol Price in Hyderabad Delhi Diesel Price Today 27 05 2021
X

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Petrol and Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశంలోని మెట్రో నగరాల్లో వారం తొలిరోజున స్థిరంగా వున్న పెట్రో ధరలు గత మూడ్రోజులుగా పెరుగుతూనే వున్నాయి. చాలా సిటీల్లో ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకగా తాజాగా పెట్రోల్ ధర 9 పైసలు డీజిల్ ధర 17 పైసలు చొప్పున పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 97.36 వద్దకు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 92.24 వద్దకు చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 93 రూపాయల 68పైసలుగా వుండగా డీజిల్ ధర 84 రూపాయల 61 పైసలు వద్దకి చేరింది. ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ముడి చమురు ధరలు పరుగులు తీస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story