Petrol and Diesel Prices Today: మరోమారు పెరిగిన పెట్రో ధరలు

Petrol and Diesel Prices Today: దేశంలో పెట్రో ధరలు మరో మారు పెరిగాయి.

Arun Chilukuri
Published on: 25 May 2021 10:01 AM IST
Petrol and Diesel Prices Today
X

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Petrol and Diesel Prices Today: దేశంలో పెట్రో ధరలు మరో మారు పెరిగాయి. దేశంలోని మెట్రో నగరాల్లో వారం తొలిరోజున స్థిరంగా వున్న పెట్రో ధరలు మంగళవారం రోజున మళ్లీ పెరిగాయి. అయితే ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకగా తాజాదా పెట్రోల్ ధర 24 పైసలు డీజిల్ ధర 27 పైసలు చొప్పున పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 97.12 వద్దకు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 91.92 వద్దకు చేరాయి.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 93 రూపాయల 44 పైసలుగా వుండగా డీజిల్ ధర 84 రూపాయల 32 పైసలు వద్దకి చేరింది. ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ముడి చమురు ధరలు పరుగులు తీస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story