Petrol and Diesel Prices Today: స్థిరంగా, నిలకడగా పెట్రో ధరలు

Petrol and Diesel Prices Today: దేశంలో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 24 May 2021 11:01 AM IST
Today Petrol Price in Hyderabad Delhi Diesel Price Today 24 05 2021
X

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Petrol and Diesel Prices Today: దేశంలో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని మెట్రో నగరాల్లో సోమవారం రోజున పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకగా ఆదివారం రోజున పెట్రోల్ ధర 18 పైసలు డీజిల్ ధర 29 పైసలు చొప్పున పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 96.88 వద్దకు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 91.65 వద్దకు చేరాయి.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 93 రూపాయల 21 పైసలుగా వుండగా. డీజిల్ ధర 84 రూపాయల 07 పైసలు వద్దకి చేరింది. ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ముడి చమురు ధరలు పరుగులు తీస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story