Petrol Price in India: సరికొత్త గరిష్టానికి చేరిన పెట్రో ఉత్పత్తుల ధరలు

Petrol Price in India: దేశంలో పెట్రో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

Samba Siva Rao
Published on: 10 March 2021 10:11 AM IST
Petrol and diesel prices
X

Petrol and diesel prices 

Petrol Price in India: దేశంలో పెట్రో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా గత 11 రోజులుగా దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.అయితే ఇప్పటికే గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ రేటు లీటర్ కు 4 రూపాయల 87 పైసల మేర పెరగ్గా...డీజిల్ లీటర్ కు 4 రూపాయల 99 పైసల మేర పెరగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ వద్దకు చేరగా..ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు ఏపీలోని మెట్రో నగరాల్లో 87 రూపాయల 24 పైసలు వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పరుగులు కొనసాగుతున్నప్పటికీ..దేశీయ మార్కెట్లో పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఇందుకు కారణం కావచ్చన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story