Gold Rate: దూసుకెళుతోన్న వెండి, బంగారం ధరలు

Gold Rate: దేశీయంగా బంగారం, వెండి ధరలు దూసుకెళుతున్నాయి.

Kranthi
Published on: 15 April 2021 7:10 AM IST
Today Gold Rate, Silver Price 15th-April-2021
X

Gold Rate:(File Image)

Gold Rate: దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు దూసుకెళుతున్నాయి. గురువారం మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 పెరుగుదలతో రూ.47,780కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 పెరుగుదలతో రూ.43,800కు ఎగసింది.

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,120కి చేరుకుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,690వద్ద కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,850 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,080 వద్ద ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 వద్ద ఉంది. అలాగే విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,400 ఉండగా,24 క్యారెట్ల రూ.47,350 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు..

గత 13 రోజుల్లో వెండి ధర కేజీకి రూ.4,600 పెరిగింది. నిన్న స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి కేజీ వెండి ధర రూ.71,900 ఉంది. అలాగే... వెండి 8 గ్రాములు (తులం) కావాలంటే దాని ధర రూ.575.20 ఉంది. ఒక్క గ్రాము వెండి ధర రూ.71.90 ఉంది. గత 6 నెలలతో పోల్చితే... అప్పుడప్పుడూ తగ్గుతూ ఉన్నా... ఓవరాల్‌గా వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 6 నెలల కిందట అక్టోబర్ 14న వెండి ధర కేజీ రూ.62,000 ఉంది. ఇప్పుడు రూ.71,900 ఉంది. అంటే రూ.9,900 పెరిగింది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం ధరలు 15-04-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.

Kranthi

Kranthi

Next Story