Gold, Silver Price Today: పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరలు మాత్రం తగ్గాయి.

Kranthi
Updated on: 27 Jun 2021 7:15 AM IST
Today Gold Rate 27 06 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: పసిడి ప్రియులకు కాస్త బ్యాడ్ న్యూస్. గత కొంత కాలంగా బంగారం ధర తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ బులియన్ మార్కెట్‌ ప్రకారం.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. తాజాగా మంగళవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. కొన్ని చోట్ల తగ్గితే.. మరికొన్నిచోట్ల ధరలు స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు ధర రూ.46,100 ఉంది. ఇప్పుడు రూ.44,100 ఉంది. అంటే... 15 రోజుల్లో ధర రూ.2,000 తగ్గింది. అదే 24 క్యారెట్ల పెట్టుబడి బంగారం 10 గ్రాములు జూన్ 11న రూ.50,300 ఉండగా... ఇప్పుడు రూ.48,100 ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 వద్ద ట్రేడ్ అవుతోంది.

.వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం ధర తగ్గగా, వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. తాజాగా దేశీయంగా పరిశీలిస్తే కిలో వెండి తగ్గముఖం పట్టింది. కిలో వెండిపై రూ.400 వరకు తగ్గింది. అయితే కొన్ని నగరాల్లో తగ్గితే .. మరి కొన్ని నగరాల్లో నిలకడగా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, చెన్నైలో రూ.73,400 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కోల్‌కతాలో రూ.67,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కేరళలో రూ.67,900 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, విజయవాడలో రూ.73,400 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 27-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story