Gold Rate: స్వ‌ల్పంగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌.. స్థిరంగా వెండి ధ‌ర‌

Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
x

Gold Price 

Highlights

Gold Rate: వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి

Gold Rate: బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు(ఏప్రిల్ 26 ) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొన‌సాగుతున్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. సోమ‌వారం (25.04.2021) బంగారం ధరలు ఆదివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 44,590 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 10 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48,650 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు స్థిరంగా కొన‌సాగుతున్నాయి. కేజీ వెండి ధర ఆదివారం నాటి ప్రారంభ ధరలతో పోలీస్తే ఎలాంటి పెరుగుద‌ల న‌మోదు కాలేదు. ఈరోజు వెండి ధర కేజీకి 74వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 74,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. సోమ‌వారం (26.04.2021) బంగారం ధరలు ఆది వారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 44,590 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 10 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48,650 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న‌టి ప్రారంభ ధరతో పోలిస్తే మార్పులు లేకుండా 46,240 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్న ధరతో పోలిస్తే మార్పులు లేకుండా 50,460 రూపాయల వద్ద నిలిచింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర ఆదివారం నాటి ప్రారంభ ధరల కంటే ఎలాంటి పెరుగుద‌ల న‌మోదు కాలేదు. ఈరోజు వెండి 69వేల రూపాయల మార్క్ ముందు ఆగిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 68,800 రూపాయల వద్ద నమోదు అయింది. హైద‌రాబాద్ ధ‌ర‌ల పోలీస్తే ఢిల్లీ 5400 రూపాయ‌లు త‌క్కువ‌గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26-04-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories