Gold Rate: పెరిగిన వెండి ధ‌ర‌.. బంగారం ధరలు మాత్రం ఇలా

Gold Rate: ఈరోజు బంగారం ధరలలో మార్పులు లేవు. ఇక వెండి ధరలు మాత్రం పెరుగుదల బాట వదలలేదు. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Samba Siva Rao
Updated on: 26 May 2021 1:53 PM IST
Gold rate today and Silver rate today
X

Gold rate today

Gold Rate: హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. మంగ‌ళ‌వారం (25.05.2021) బంగారం ధరలు సోమ‌వారం ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 45,600 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 50వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా ఎగువన 49,750 రూపాయలుగా నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. మంగ‌ళ‌వారం (25.05.2021) బంగారం ధరలు సోమ‌వారం ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 45,600 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 49 వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా ఎగువన 49,750 రూపాయలుగా నిలిచింది.

వెండి ధ‌ర‌లు

బంగారం ధ‌ర‌లు స్థిరంగా కొన‌సాగుతుంటే వెండి ధ‌ర‌లు మాత్రం కాస్త పెరిగాయి. గ‌త నాలుగు రోజులుగా వెండి ధ‌ర‌లు నిల‌క‌డ‌గా ఉన్నాయి . సోమ‌వారం ప్రారంభ ధ‌ర‌ల‌తో పోలిస్తే కాస్త పెరిగాయి. కేజీ వెండి ధ‌ర విష‌యానికి వ‌స్తే 75.700 రూపాయ‌ల నుంచి 300 రూపాయ‌లు పెర‌గి 76 వేల రూపాయ‌ల‌ మార్క్ వ‌ద్ద కొన‌సాగుతుంది. కేజీ వెండి 76.000 రూపాయ‌లుగా కొన‌సాగుతుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమ‌వారం నాటి ప్రారంభ ధర 46,930 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమ‌వారం నాటి ప్రారంభ ధర 50,830 రూపాయల వద్ద ఉంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమ‌వారం నాటి ప్రారంభ ధరకంటె 300 రూపాయల పెరుగుదల నమోదు చేసి 71 వేల 500 రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగబాకాయి. దీంతో కేజీ వెండి ధర 71,500 వ‌ద్ద నిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25-05-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story