Gold, Silver Price Today: పసిడి పై పైకి

Gold Price Today: బంగారం ధరలు మళ్లీ పెరగ్గా... వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తోంది.

Kranthi
Updated on: 20 May 2021 11:13 AM IST
Today Gold Rate 20 05 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
X

Gold, Silver Price Today:(File Image) 

Gold Price Today: దేశ వ్యాప్తంగా బంగారం ధర పరుగులు పెడుతున్నాయి. నెల క్రితం 40వేల చేరువలో ఉన్న బంగారం ధరలు.. మళ్లీ 45 వేల మార్క్ దాటాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై స్వల్పంగా పెరిగింది. బుధవారం 22 క్యారెట్ల తులం బంగారం.. 45,640 ఉండగా.. గురువారం రూ.45,650 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈ రోజు 46,820 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర 50,720 గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,650 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 46,650 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,460 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,600 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,770 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,920 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,450 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.49,590 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.49,590 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,590 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. బుధవారం 2వేల మేర పెరిగిన కిలో వెండి ధర.. గురువారం వేయి రూపాయల మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర 72,000 నుంచి 71,000లకు తగ్గింది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,000 లు ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.73,000 గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500 ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది. బెంగళూరులో రూ.73,000 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,000 వద్ద ఉంది..

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో వెండి కిలో రూ.77,500 లు ఉంది. విజయవాడలో వెండి రూ.77,500లు వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 20-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story