Gold, Silver Price Today: డౌన్ ట్రెండ్ లో బంగారం ధరలు

Gold, Silver Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

Kranthi
Published on: 18 Jun 2021 7:03 AM IST
Today Gold Rate 18 06 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. గత రెండు రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా 10 గ్రాముల బంగారంపై వంద రూపాయల లోపు తగ్గగా, హైదరాబాద్‌, ఢిల్లీలో మాత్రం రూ.600 వరకు తగ్గుముఖం పట్టింది. బెంగళూరులో రూ.500 వరకు తగ్గింది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,900 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,890 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.48,930 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. బంగారం ధరలు దిగివస్తుండగా, వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. తాజాగా దేశీయంగా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ.1000 వరకు తగ్గుముఖం పట్టగా, హైదరాబాద్‌లో రూ.1100 వరకు తగ్గుముఖం పట్టింది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,300 ఉండగా, చెన్నైలో రూ.75,100 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.70,300 ఉండగా, కోల్‌కతాలో రూ.70,300 ఉంది, అలాగే బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,300 ఉండగా, కేరళలో రూ.70,300 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,100 ఉండగా, విజయవాడలో రూ.75,100 వద్ద కొనసాగుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 18-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story