Today Gold, Silver Rates: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold, Silver Rates: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Sandeep Reddy
Updated on: 10 Aug 2021 8:00 AM IST
Today Gold Rate 10 08 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.530 తగ్గడంతో పసిడి ధర రూ.47,300కు చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.490 తగ్గడంతో రూ.43,350 కు పడిపోయింది.

ఇక ఇలా పసిడి ధర పడిపోగా వెండి ధర కూడా ఇదేదారిలో పయనించింది. వెండి రేటు ఈ మధ్య ఎన్నడూ లేని విధంగా రూ.1500 పడిపోవడంతో కేజీ వెండి ధర రూ.68,700కు చేరింది. దేశీయ మార్కెట్లో పసిడి ధర తగ్గగా అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.37 శాతం పైకి కదిలడంతో బంగారం రేటు ఔన్స్‌కు 1732 డాలర్లకు చేరింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచి ఔన్స్‌కు 0.79 శాతం పెరుగుదలతో 23.45 డాలర్లకు చేరింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story