Gold, Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరగ్గా, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది.

Kranthi
Published on: 9 Jun 2021 6:41 AM IST
Today Gold Rate 09 06 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
X

Gold, Silver Price Today: (File Image)

Gold Price Today: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ మాత్రం పరుగులు పెట్టాయి. దేశీయ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,680 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,680గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,050 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420గా ఉంది. అలాగే ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,680 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,680గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,300గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,500గా ఉంది. ఇకపోతే… బెంగుళూరులోని మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,900గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,070గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,900గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50.070గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల బంగారం ధర రూ. 45,900గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,070గా కొనసాగుతోంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. కాగా తాజాగా.. బుధవారం వెండి ధరలు స్వల్ప మార్పులు కనిపించాయి. వెండి ధరలు స్వల్పంగా స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో వెండి ధర రూ. 700 పెరిగింది. దీంతో మార్కెట్లో కిలో వెండి ధర రూ.71,700 ఉండగా.. 10 గ్రామలు ధర రూ. 717గా ఉంది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,700 ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 717 దగ్గర కొనసాగుతుంది. ఆర్థిక రాజధాని ముంబైలో కూడా వెండి ధరలలో మార్పులు జరిగాయి. అక్కడ కిలో వెండి ధర రూ. 71,700 ఉండగా.. 10 గ్రాముల ధర రూ.717గా ఉంది. చెన్నైలో కేజీ సిల్వర్ రేట్ రూ. 76,300గా ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 763 గా ఉంది. అలాగే బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 76,300గా ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 763గా కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 76,300 ఉండగా.. 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 763గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో కేజీ సిల్వర్ రేట్ రూ. 76,300గా ఉండగా.. 10 గ్రాముల ధర రూ. 763గా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 09-06-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story