Today Gold, Silver Rates: పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. నిలకడగా వెండి ధర

* నేటి బంగారం, వెండి ధరలు

Sandeep Reddy
Updated on: 6 Oct 2021 10:50 AM IST
Today Gold Rate 06 10 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.260 పెరగడంతో పసిడి ధర రూ.47,730 కు చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.240 పెరగడంతో రూ.43,750 కు చేరింది. ఇలా పసిడి ధర పెరగగా వెండి ధర తటస్థంగా ఉండిపోయింది. వెండి రేటు మంగళవారంతో ధరలో ఎలాంటి మార్పు లేకుండా కేజీ వెండి ధర రూ.64,800 కు వద్ద ఉంది.

దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరగగా అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం స్వల్పంగా ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరగడంతో ఔన్స్‌కు 0.16 శాతం తగ్గింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1758 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా తగ్గడంతో ఔన్స్‌కు 0.03 శాతం తగ్గుదలతో 22.60 డాలర్లకు పడిపోయింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story