Home Loan Tips: హోంలోన్ తీసుకున్నారా? ఈ టిప్స్‌తో రుణం త్వరగా తీర్చవచ్చు..!

Tips to Repay Your Home Loan Faster
x

Home Loan Tips: హోంలోన్ తీసుకున్నారా? ఈ టిప్స్‌తో రుణం త్వరగా తీర్చవచ్చు..!

Highlights

Home Loan Tips: హోంలోన్ తీసుకున్న వారు చిన్న చిన్న విషయాలను పాటిస్తే హోంలోన్ ను త్వరగా తీర్చుకోవచ్చు.

Home Loan Tips: హోంలోన్ తీసుకున్న వారు చిన్న చిన్న విషయాలను పాటిస్తే హోంలోన్ ను త్వరగా తీర్చుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు మార్పులు చేసిన సమయంలో హోంలోన్ తీసుకున్న వారి ఈఎంఐపై దాని ప్రభావం ఉంటుంది. హోంలోన్ తీసుకున్నవారు అసలు కంటే వడ్డీకి ఎక్కువగా చెల్లిస్తారు. హోంలోన్ భారం తగ్గించేందుకు ఆర్ధిక నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వీటిని పాటిస్తే వడ్డీ భారం కొంత తగ్గే అవకాశం ఉంది.

హోంలోన్ ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ ఈబీఎల్ఆర్‌తో అనుసంధానమైతే ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే దాని ప్రభావం ఈఎంఐపై ఉంటుంది. అంటే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచితే ఈఎంఐ పెరుగుతుంది, తగ్గిస్తే ఈఎంఐ తగ్గుతుంది. ఒకవేళ ఈబీఎల్ఆర్ కు హోంలోన్ ను లింక్ చేయకపోతే వెంటనే బ్యాంకులో ఇందుకు సంబంధించిన ధరఖాస్తు చేయాలి. బ్యాంకు కస్టమర్ కేర్ తో సంప్రదించి ఆన్ లైన్ లో మీ ధరఖాస్తును పంపించాలి.

హోంలోన్స్ ను బ్యాంకుల్లో కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎన్ బీ ఎఫ్ సీ ద్వారా తీసుకొంటే వడ్డీ రేట్లలో మార్పులు వెంటనే అమల్లోకి రావు.. ఈ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు రుణాన్ని ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. దీనిపై బ్యాంకు అధికారులతో చర్చించవచ్చు. దీనికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. లేదా మీరు ప్రస్తుతం రుణం తీసుకున్న బ్యాంకు అధికారులనే వడ్డీ తగ్గించాలని కోరే అవకాశం కూడా ఉంది. మీ సిబిల్ స్కోర్ ఆధారంగా దీనిపై బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుంటారు.

హౌసింగ్ లోన్లు తీసుకొనే సమయంలో ఈఎంఐ వ్యవధి తక్కువ ఉంటే కట్టే వడ్డీ కూడా తక్కువ ఉంటుంది.లోన్ టర్మ్ ఎక్కువ ఉంటే బ్యాంకుకు వడ్డీ రూపంలో ఎక్కువ చెల్లిస్తాం. ప్రతి ఏటా కనీసం ఒకటి లేదా రెండు ఈఎంఐలు చెల్లించినా మీరు తీసుకొన్న అప్పును త్వరగా క్లియర్ చేయవచ్చు. లేదా ఈఎంఐను కొంత పెంచుకోవచ్చు. సాధారణంగా చెల్లిస్తున్న ఈఎంఐకి 5 శాతం లేదా 10 శాతం పెంచుకొంటే కూడా హోంలోన్ త్వరగా క్లియర్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories