LPG Cylinder Prices : భారీగా తగ్గిన వంటగ్యాస్ ధరలు.. ఎంతో తెలుసా.?

LPG Cylinder Price: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి.

Arun Chilukuri
Published on: 1 May 2023 10:47 AM IST
Rate of 19 KG Commercial LPG gas Cylinders has Been Slashed by Rs 171.50
X

LPG Cylinder Prices : భారీగా తగ్గిన వంటగ్యాస్ ధరలు.. ఎంతో తెలుసా.?

LPG Cylinder Price: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తూ పెట్రోలియం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను ₹171.50 తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ తగ్గింపు నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1856.50కి తగ్గింది. అటు ముంబైలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,808.50 కాగా, కోల్‌కతాలో రూ. 1,960.50, చెన్నైలో రూ.2,021.50గా ఉంది.

అయితే గృహ వినియోగ సిలిండర్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని చమురు సంస్థలు తెలిపాయి. ప్రతినెల 1వ తేదీన గ్యాస్ ధరలను సమీక్షించి ప్రకటించే ఆయిల్ కంపెనీలు.. ఈసారి భారీగా ఉపశమనం కలిగించే రీతిలో తగ్గింపు నిర్ణయం తీసుకున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story