Gold Rate Today: బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.. భారీగా పెరిగిన పసిడి ధర

Dhivi
Published on: 23 Jan 2025 5:43 AM IST
Gold Rate Today: బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.. భారీగా పెరిగిన పసిడి ధర
X

Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కొన్ని వారాల నుంచి స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర గత వారం రోజుల్లో రూ. 2,500కు పైగా పెరిగింది. అంతర్జాతీయ పరిణామాల మధ్య ఆభరణాల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో గురువారం దేశ రాజధానిలో స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 860కి పెరిగి రూ. 82,730కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. వరుసగా 6వ రోజు పెరగడంతో ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 750 పెరిగి జీవితకాల గరిష్టం రూ. 75,250పలుకుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానం చుట్టూ ఉన్న అనిశ్చితి నెలకున్న కారణంగా బంగారం వంటి సురక్షితమైన సాధానాలపై పెట్టుబడిదారులు ఆసక్తి కనపబరుస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ డాలర్ బలహీనపడటంతో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ట్రంప్ ధోరణితో దీర్ఘకాలిక వానిజ్య ఆందోళనల వల్ల ఇన్వెస్టర్లు బంగారంవైపునకు మళ్లుతున్నారని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ విశ్లేషకులు సౌమిల్ గాంధీ తెలిపారు. బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గురువారం వెయ్యికిపైగా పెరిగింది. దీంతో రూ. 1,04,000కి చేరుకుంది.

Dhivi

Dhivi

Next Story