OTT Platform: ఉద్యోగులని తొలగిస్తున్న ఫేమస్‌ ఓటీటీ కంపెనీ.. కారణం ఏంటంటే..?

The Netflix Company That is Laying Off Employees in America
x

OTT Platform: ఉద్యోగులని తొలగిస్తున్న ఫేమస్‌ ఓటీటీ కంపెనీ.. కారణం ఏంటంటే..?

Highlights

Netflix: ప్రపంచంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

Netflix: ప్రపంచంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతోంది. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఫేమస్‌ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కూడా చేరింది. ఈ కంపెనీ రెండోసారి ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచింది. 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఇది కంపెనీ ఉద్యోగులలో 4 శాతం. మొదటిసారి నెట్‌ఫ్లిక్స్‌ చాలామంది సబ్‌స్కైబర్స్‌ని కోల్పోయిన తర్వాత ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగులని తొలగించడం ఇది రెండోసారి. ఈ చర్య భాగంగా అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ వేటు పడింది.

గత నెలలో కూడా ఉద్యోగుల తొలగింపు

గత నెలలో కూడా కంపెనీ ఉద్యోగులను తొలగించింది. నెట్‌ఫ్లిక్స్ గత నెలలలో 150 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే కంపెనీ ఒక ప్రకటనలో "మేము వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తున్నాం. తద్వారా మా ఖర్చులు పెరిగాయి. అందుకే ఆదాయ వృద్ధికి అనుగుణంగా ఉద్యోగులని మెయింటన్ చేస్తున్నాం' అని సమాధానమిచ్చింది. ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌లో యుద్ధం, ఓటీటీలో తీవ్రమైన పోటి కారణంగా కంపెనీ ఇటీవలి ఒత్తిడికి గురైందని తెలిపింది.

కస్టమర్ల సంఖ్య తగ్గుదల

మొదటి త్రైమాసికంలో చందాదారుల సంఖ్య తగ్గిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుత కాలానికి మరింత ఎక్కువ నష్టాన్ని అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఇతర పోటీ కంపెనీల చందాదారుల సంఖ్య పెరిగింది. ఈ పరిస్థితిలో నెట్‌ఫ్లిక్స్ చందాదారులను పెంచడానికి చౌకైన ప్రణాళికలను తీసుకురావాలని ఆలోచిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories