Tomato,Onion Prices: తగ్గిన టమోట, ఉల్లిపాయ ధరలు.. కారణం ఇదే..!

The Average Price of Tomato has Decreased by 29 Percent Compared to June and Onion Prices Have Also Decreased
x

Tomato,Onion prices: తగ్గిన టమోట, ఉల్లిపాయ ధరలు.. కారణం ఇదే..!

Highlights

Tomato,Onion prices: గత కొన్ని రోజుల క్రితం టమోట, ఉల్లి ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు చుక్కలు చూసిన సంగతి తెలిసిందే.

Tomato,Onion prices: గత కొన్ని రోజుల క్రితం టమోట, ఉల్లి ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు చుక్కలు చూసిన సంగతి తెలిసిందే. కానీ జూలైలో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మార్కెట్లలోకి టమోట రాక మెరుగ్గా ఉండటంతో టమోట ధరలు 29 శాతం క్షీణించాయి. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉల్లి రిటైల్ ధర కూడా చాలా వరకు నియంత్రణలో ఉందని గతేడాది కంటే తొమ్మిది శాతం తక్కువగా ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.

మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం టొమాటో సగటు రిటైల్ ధర కిలోకు రూ. 37.35 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో అయితే కిలో రూ. 52.5గా ఉంది. గణాంకాల ప్రకారం అఖిల భారత సగటు రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.25.78గా ఉంది. ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వం 2.50 లక్షల టన్నుల ఉల్లిపాయ స్టాక్‌ను సిద్ధం చేసింది. ఇది ఇప్పటివరకు కొనుగోలు చేసిన ఉల్లిలో అత్యధిక స్టాక్‌గా చెప్పవచ్చు. అందుకే ఉల్లిపాయ ధర తక్కువగా ఉంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ధరలు దిగొచ్చాయి. దీంతో దేశీయంగా ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వం గత కొన్ని రోజుల కిందటే ఉత్పత్తి సంస్థలను ఆదేశించింది. దేశ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రేట్లను వంటనూనెల విక్రయ సంస్థలు తగ్గించాయి. ప్రస్తుతం ఈ ధరలు మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇండోనేషియా ఎక్స్‌పోర్టు లెవీని తీసివేయడంతో ఆ దేశం నుంచి మనకు పామాయిల్ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories