Tata Motors: కారు కొనుగోలు దారులకు 'టాటా' గుడ్‌న్యూస్‌.. రూ.60 వేల వరకు డిస్కౌంట్లు..?

Tata Motors: కారు కొనుగోలు దారులకు 'టాటా' గుడ్‌న్యూస్‌.. రూ.60 వేల వరకు డిస్కౌంట్లు..?

Arun Chilukuri
Published on: 13 Feb 2022 8:44 AM IST
Tata Motors: కారు కొనుగోలు దారులకు టాటా గుడ్‌న్యూస్‌.. రూ.60 వేల వరకు డిస్కౌంట్లు..?
X

Tata Motors: కారు కొనుగోలు దారులకు 'టాటా' గుడ్‌న్యూస్‌.. రూ.60 వేల వరకు డిస్కౌంట్లు..?

Tata Motors: దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కార్ల విక్రయాలు పెంచుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటించింది. గత ఏడాది కొవిడ్ వల్ల ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగనందున వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మోడళ్లను బట్టి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

సఫారీ 2021 వేరియంట్లపై అదిరే ఆఫర్​..

టాటా ఫ్లాగ్​షిప్ ఎస్‌యూవీ సఫారీపై టాటా మోటార్స్ భారీ ఆఫర్ ప్రకటించింది. హారియర్​ మోడల్‌ లాగానే సఫారీ కూడా డీజిల్​వేరియంట్ మాత్రమే. అయితే ఇందులో ఆటో ట్రాన్స్​మిషన్ లేదా మాన్యువల్ వేరింయట్‌ని ఎంచుకునే వీలుంది. ఇక ఆఫర్ విషయానికొస్తే.. రూ.60 వేల వరకు ఈ మోడల్​పై డిస్కౌంట్ ప్రకటించింది. 2021లో విక్రయం వాటికి ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎక్ఛేంజ్ బెనిఫిట్స్ కలుపుకుని ఈ ఆఫర్​ పొందొచ్చని తెలిపింది. ఇక ౨౦౨౨ వేరియంట్ కావాలంటే ఎక్స్ఛేంజ్, డిస్కౌంట్ కలిపి రూ.40,000 వరకు తగ్గింపు పొందొచ్చని టాటా మోటార్స్ తెలిపింది.

టాటా హారియర్​పై భారీ డిస్కౌంట్​..

టాటా పోర్ట్​ఫోలియోలో మిడ్​సైజ్ ఎస్‌యూవీ అయిన హారియర్‌ మోడల్​పై కూడా రూ.60 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్​ 2021 స్టాక్ పై లభిస్తుంది. 2022 వేరియంట్​పై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుందని తెలిపింది. ఇదే మోడల్ డార్క్ ఎడిషన్‌కి బోనస్​ పొందొచ్చని వివరించింది. కార్పొరేట్ కొనుగోలుదారులకు ఈ బోనస్​రూ.25 వేలుగా ఉంటుందని తెలిపింది.

టియాగోపై రూ.30 వేలు తగ్గింపు

ఇటీవలే విడుదల చేసిన టియాగో సీఎన్​జీ వేరియంట్​పై రూ.10 వేల వరకు రివార్డ్​తో పాటు రూ.20 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్​ ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక కార్పొరేట్ కొనుగోలుదారులకు రూ.5 వేలు డిస్కౌంట్ ఇవ్వనుంది.

టిగోర్ పై రూ.25 వేల వరకు తగ్గింపు

టాటా సెడాన్ విభాగంలోని టిగోర్​పై కూడా టాటా మోటార్స్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సీఎన్​జీ వేరియంట్‌లకి మినహా ఇతర వేరియంట్లపై రూ.25 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చని పేర్కొంది.

నెక్సాన్​పై ఆఫర్లు ఇవే..

టాటా కార్లలో ఎక్కువ మంది ఇష్టపడే మోడళ్లలో నెక్సాన్ కూడా ఒకటి. ఈ మోడల్​ ఇంజిన్​, సహా ఇతర ఫీచర్లు వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తాయి.ఈ మోడల్​పై ఎక్స్ఛేంజ్ ఆఫర్​ కింద రూ.15 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఇక కార్పొరేట్ కొనుగోలుదారులకైతే రూ.10 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story