SSY Rules Changed: సుకన్య సమృద్ధి యోజనలో మారిన నిబంధనలు.. అవేంటో తెలుసుకోండి..?

Sukanya Samriddhi Yojana These Rules Have Changed
x

SSY Rules Changed: సుకన్య సమృద్ధి యోజనలో మారిన నిబంధనలు.. అవేంటో తెలుసుకోండి..?

Highlights

SSY Rules Changed: మీరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టినట్లయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

SSY Rules Changed: మీరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టినట్లయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఈ ప్రత్యేక పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ కుమార్తె 21 సంవత్సరాలలో లక్షాధికారి అవుతుంది. మీరు ఈ స్కీమ్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ప్రతిరోజూ రూ. 416 ఆదా చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే రూ. 65 లక్షల భారీ ఫండ్‌ క్రియేట్‌ అవుతుంది.

సుకన్య సమృద్ధి యోజన

సుకన్య సమృద్ధి యోజన ఒక దీర్ఘకాలిక పథకం. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ కుమార్తె విద్య, భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని మార్పులు జరిగాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఖాతా వార్షిక వడ్డీ జమ అవుతుంది.

ఏటా కనీసం రూ.250 ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయని పక్షంలో ఖాతా డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. ఒకవేళ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయకపోతే మెచ్యూరిటీ వరకు ఖాతాలో జమ చేసిన మొత్తంపై అంతకు ముందున్న వడ్డీని చెల్లిస్తారు. ఇంతకు ముందు డిఫాల్ట్ ఖాతాలు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే రేటుతో వడ్డీని పొందేవి. ఇంతకు ముందు ఈ పథకంలో 80సి కింద పన్ను మినహాయింపు ఇద్దరు కుమార్తెలకి మాత్రమే ఉండేది. కొత్త నిబంధన ప్రకారం ఇద్దరు కవల కుమార్తెలు పుడితే వారితో పాటు మరొకరికి కూడా అవకాశం ఉంటుంది.

సుకన్య సమృద్ధి యోజన కింద తెరిచిన ఖాతాను రెండు సందర్భాల్లో మూసివేయవచ్చు. ముందుగా కూతురు చనిపోతే రెండోది కూతురు చిరునామా మారితే. కానీ కొత్త మార్పు సంరక్షుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సందర్భంలో కూడా ఖాతాను మూసివేయవచ్చు. డబ్బులు విత్‌ డ్రా చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories