Stock Markets Today: లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

Stock Markets Today: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి

K V D Varma
Published on: 15 Feb 2021 9:55 AM IST
Stock Market Today
X

ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ (పాత ఫోటో)

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి...తాజావారం తొలి సెషన్ లో బెంచ్ మార్క్ సూచీలు సరికొత్త రికార్జులు సృష్టిస్తున్నాయి... కరోనా వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన దరిమిలా ప్రపంచ ఆర్దిక వృద్దికి ఢోకా లేదన్న సానుకూల అంచనాలు ఈక్విటీ మార్కెట్లను పరుగులు పెట్టిస్తున్నాయి...అంతర్జాతీయ మార్కెట్లు వారాంతాన రికార్డ్ లాభాల్లో ముగియగా..ఏషియన్ మార్కెట్లు సైతం తాజా సెషన్ లో సరికొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నాయి...గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి....ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్‌ 350 పాయింట్లు జంప్ చేయగా... నిఫ్టీ సైతం 125 పాయింట్ల మేర లాభంతో 15,280 వద్ద కదలాడుతోంది...

K V D Varma

K V D Varma

Next Story