Stock Market: లాభాల బాటలో పయనించిన మార్కెట్లు

Stock Market: 677 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 May 2024 9:07 PM IST
Stock Markets On A Profit Streak
X

Stock Market: లాభాల బాటలో పయనించిన మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా ఈ ఉదయం నుంచి సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంలో సూచీలు ఒక్కసారిగా లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, భారతి ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 677 పాయింట్లు లాభపడి 73వేల 663కు పెరిగింది. నిఫ్టీ 203 పాయింట్లు పుంజుకుని 22వేల 403 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, టైటాన్ షేర్లు నిలవగా.. టాప్ లూజర్స్‌గా మారుతి, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్‌లు నిలిచాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story