దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట

దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట
x
Highlights

దేశీ స్టాక్ మార్కెట్లు తాజా వారంలో లాభాల బాటన పరుగులు తీశాయి. మార్కెట్‌లో అనిశ్చితి పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్యూ2...

దేశీ స్టాక్ మార్కెట్లు తాజా వారంలో లాభాల బాటన పరుగులు తీశాయి. మార్కెట్‌లో అనిశ్చితి పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్యూ2 ఫలితాల నమోదు, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ చర్చల పురోగతి వంటి అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. వారం మొత్తంగా చూస్తే సెన్సెక్స్‌ 702 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్లు మేర లాభపడ్డాయి.

దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారం తొలిరోజున భారీ లాభాలను అందించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించింది. ముగింపులో సెన్సెక్స్‌ 448 పాయింట్లు జంప్‌చేసి 40వేల 431 వద్దకు చేరగా నిఫ్టీ సైతం 110 పాయింట్లు పెరిగి 11వేల 873 వద్ద స్థిరపడింది. ఇక రెండో రోజున దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కాగా ఆరంభ ట్రేడింగ్‌లోనే నష్టాలను వీడి లాభాల బాట పట్టాయి. చివర్లో సెన్సెక్స్‌ 112 పాయింట్లు పుంజుకుని 40 వేల 544 వద్దకు చేరగా నిఫ్టీ సైతం 23 పాయింట్లు బలపడి 11 వేల 896 వద్ద స్థిరపడింది. ఇక మూడో సెషన్ లోనూ దేశీ మార్కెట్లు లాభాలను అందించాయి. సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ సాధించగా నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 12 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది.

దేశీ మార్కెట్లు వారంలో నాలుగో సెషన్ లో మాత్రం నష్టాల బాట పట్టాయి. గ్లోబల్ మార్కెట్లు డీలాపడిన నేపధ్యంలో దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీయడంతో వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 148 పాయింట్ల నష్టంతో 40,558 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 11,896 వద్ద స్థిరపడ్డాయి. వారాంతపు సెషన్ కి వచ్చేసరికి మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. దీంతో మార్కెట్‌ నష్టాలు ఒక్క రోజుకే పరిమితమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు వారాంతాన ఇన్వెస్టర్లకు లాభాలను మిగిల్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories