Stock Markets: వరుసగా ఐదో రోజు నష్టాల్లో దేశీ సూచీలు..

Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Published on: 18 March 2021 4:48 PM IST
Stock Markets Ended With Steep Losses
X

Stock Markets: వరుసగా ఐదో రోజు నష్టాల్లో దేశీ సూచీలు..

Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఫార్మా, ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయాయి. సెన్సెక్స్‌ 580 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 14,600 మార్కు దిగువన ముగిసింది. అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరుగుతుండడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా వరుసగా ఐదో సెషన్‌లోనూ దేశీ మార్కెట్లు నష్టాలు మూటగట్టాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 585 పాయింట్లు క్షీణించి 49,216 వద్దకు చేరగా, నిఫ్టీ 163 పాయింట్ల నష్టంతో 14,557 వద్ద స్థిరపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story